GROUP-I SERVICES: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీల ఖరారు.. షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దీనికి మొత్తం 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2,86,051 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడికాగా, అందులో 25,050 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.

GROUP-I SERVICES: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీల ఖరారు.. షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

GROUP-I SERVICES: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 5-12 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.

India U19 team: అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్ విజేతలకు సన్మానం.. ముఖ్య అతిథిగా ఎవరొస్తున్నారంటే

ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దీనికి మొత్తం 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2,86,051 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడికాగా, అందులో 25,050 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరికి వచ్చే జూన్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాల ఆధారంగా అభ్యర్థుల్ని వివిధ పోస్టులకు ఎంపిక చేస్తారు. హైకోర్టు ఆదేశాల మేరకు సమాంతర విధానంలో గ్రూప్-1లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం మెయిన్స్‌కు అర్హులను ఎంపిక చేశారు.

President Droupadi Murmu: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు.. మోదీ ఎన్నికల ప్రసంగంలా ఉదంటూ కామెంట్

ఈ పరీక్షల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 పోస్టుల్ని భర్తీ చేస్తారు. పరీక్షల వివరాల్ని పరిశీలిస్తే.. జూన్ 5న జనరల్ ఇంగ్లీష్, జూన్ 6న పేపర్-1 జనరల్ ఎస్సే, జూన్ 7న పేపర్-2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ, జూన్ 8న పేపర్-3 ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పాలన, జూన్ 9న పేపర్-4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్, జూన్ 10న పేపర్-5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రటేషన్, జూన్ 12న పేపర్-6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై పరీక్ష ఉంటుంది. ప్రతి పరీక్ష మూడు గంటలపాటు జరుగుతుంది. ప్రతి పరీక్షకు 150 మార్కులు ఉంటాయి.