Monkeypox: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మంకీపాక్స్ వైరస్ దేశంలోకి ప్రవేశించింది. గురువారం కేరళ రాష్ట్రంలో తొలికేసు నమోదయింది. విదేశాల నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Monkeypox: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

Monkeypox

Monkeypox: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మంకీపాక్స్ వైరస్ దేశంలోకి ప్రవేశించింది. గురువారం కేరళ రాష్ట్రంలో తొలికేసు నమోదయింది. విదేశాల నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ లక్షణాలు కనిపించాయి. గత రెండురోజుల క్రితం అనుమానంతో పరీక్షలు నిర్వహించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపామని, గురువారం పరీక్షల్లో మంకీ పాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జార్జ్ తెలిపారు. దీంతో భారత్ దేశంలో నమోదైన మంకీపాక్స్ తొలి కేసు ఇది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిక ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీచేసింది. కొల్లం జిల్లాలో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ అయినందున ప్రజారోగ్య చర్యల్లో భాగంగా రాష్ట్ర ఆరోగ్య అధికారులకు సహకరించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ఉన్నత స్థాయి బృందాన్ని కేరళకు పంపించనుంది.

Monkeypox: కేరళలో మంకీపాక్స్ కలకలం.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిలో రోగ లక్షణాలు

మంకీపాక్స్ నిర్ధారణ అయిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాప్తిచెందకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. మంకీపాక్స్ సోకిన వ్యక్తి తల్లిదండ్రులతో పాటు మరికొందరితో కలిసి ప్రయాణం చేసినట్లు గుర్తించారు. రోగి తల్లిదండ్రులు విమానంలో అతని పక్కన కూర్చున్నారని, తిరువనంతపురం నుండి కొల్లంకు తీసుకెళ్లిన టాక్సీ డ్రైవర్, ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్, విమానంలోని క్యాబిన్ సిబ్బందితో సహా 11మందితో కలిసి ప్రయాణించినట్లు గుర్తించామని, వారందరికీ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నామని మంత్రి అన్నారు.

ఇదిలాఉంటే దేశంలో మంకీపాక్స్ తొలికేసు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ పై జూలై 21న మంకీపాక్స్ కమిటీతో సమావేశం ఉంటుందని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలిపింది. ఇప్పటికే WHO అత్యవసర కమిటీ తొలి సమావేశం జరిగింది. 21న రెండవ సారి సమావేశం జరుగుతుంది. ఇదిలాఉంటే 64 దేశాలలో 9,200కి పైగా మంకీపాక్స్ కేసుల గుర్తించినట్లు UN ఆరోగ్య సంస్థ తెలిపింది.