Shirdi Airport : సాయి భక్తులకు శుభవార్త.. ప్రారంభమైన విమాన సేవలు

కరోనా కారణంగా ఒకటిన్నర సంవత్సరాలకు పైగా మూతబడిన షిర్డీ విమానాశ్రయం ఆదివారం ప్రారంభమైంది. పునప్రారంభం తర్వాత ఢిల్లీ నుంచి మొదటి విమానం షిర్డీకి వచ్చింది.

Shirdi Airport : సాయి భక్తులకు శుభవార్త.. ప్రారంభమైన విమాన సేవలు

Shirdi Airport

Shirdi Airport : కరోనా కారణంగా ఒకటిన్నర సంవత్సరాలకు పైగా మూతబడిన షిర్డీ విమానాశ్రయం ఆదివారం ప్రారంభమైంది. పునప్రారంభం తర్వాత ఢిల్లీ నుంచి మొదటి విమానం షిర్డీకి వచ్చింది. 11.30 గంటలకు షిర్డీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇక అదే విమానం మధ్యాహ్నం 12.30కి ఢిల్లీ తిరిగి బయలుదేరింది. దేశంలో కరోనా వ్యాప్తి సమయంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.. అదే సమయంలో చాలా విమానాశ్రయాలను మూసివేశారు. ఇక గత మూడు నెలలుగా మూతబడిన విమానాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.

Read More :  విశాఖ విమానాశ్రయంలో హై టెన్షన్

నేడు ఢిల్లీ, చెన్నై హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఢిల్లీ విమానం షిర్డీ వచ్చి వెళ్ళింది. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు ల్యాండ్ కాగా.. చెన్నై నుంచి సాయంత్రం 4.30 గంటలకు విమానం ల్యాండ్ అవుతోంది. విమాన ప్రయాణాలు మొదలు కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పైస్‌జెట్, ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలను తిప్పుతున్నాయి. ఇప్పటికే విమాన షెడ్యూల్ ని ఎయిర్ లైన్స్ విడుదల చేశాయి. విమాన ప్రయాణం చేయాలనుకునే వారు టికెట్ బుక్ చేసుకోవచ్చి ఎయిర్ లైన్స్ వర్గాలు తెలిపాయి.

Read More :  విశాఖ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం