Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్.. ఏ మోడల్ ధర ఎంతంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఇప్పుడు ప్లస్ మెంబర్‌ ల కోసం అందుబాటులోకి వచ్చింది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్.. ఏ మోడల్ ధర ఎంతంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Flipkart Big Saving Days _ Apple iPhone 14 available at its ‘lowest-ever’ price

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఇప్పుడు ప్లస్ మెంబర్‌ (Plus Members)ల కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ (Apple iPhone 14)ని అత్యంత తక్కువ ధరకు ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజ్ మోడల్ తగ్గింపు ధర రూ. 66,999గా ఉంది. ICICI బ్యాంక్, CitiBank కార్డ్‌లపై 10శాతం వరకు అదనపు తగ్గింపు అందిస్తోంది.

ఐఫోన్ 14 గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయింది. 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 79,900 ప్రారంభ ధరతో వస్తుంది. కానీ, ప్రస్తుత సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో 14శాతం ఫ్లాట్ డిస్కౌంటుతో లభిస్తుంది. అదేవిధంగా, ఈ ఐఫోన్ 256GB, 512GB మోడల్‌లు వరుసగా రూ.76,999, రూ. 96,999 తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నాయి. మీరు కొత్త ఐఫోన్‌ను కొనేందుకు చూస్తున్నారా? అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనేందుకు ఇదే బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఆపిల్ ఐఫోన్ 14 ఫీచర్లు ఇవే :
Apple iPhone 14 సిరీస్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. అలాగే, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజీ ఆప్షన్లతో Apple A15 బయోనిక్ చిప్‌సెట్ డివైజ్ కలిగి ఉంది. కొనుగోలుదారులు iPhone 14 మల్టీ కలర్ వేరియంట్‌ల నుంచి నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు.

Flipkart Big Saving Days Sale_ Apple iPhone 14 available at its ‘lowest-ever’ price

Flipkart Big Saving Days Sale_ Apple iPhone 14 available

Read Also : Apple iPhone 14 Plus : 2023 కొత్త ఏడాదిలో అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు.. ఇప్పుడే కొనేసుకోండి!

కెమెరాల విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 12MP ప్రైమరీ లెన్స్‌ను కలిగి ఉంది. పెద్ద సెన్సార్, పెద్ద పిక్సెల్‌లను కలిగి ఉంటుంది. తక్కువ-కాంతిలోనూ కెమెరాల పనితీరు f/1.9 ఎపర్చర్‌తో కొత్త 12MP ఫ్రంట్ TrueDepth కెమెరాను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 14లో వీడియోల కోసం కొత్త యాక్షన్ మోడ్‌ను అందిస్తుంది. ఏదైనా మోషన్ మధ్యలో వీడియో క్యాప్చర్ చేసినప్పుడు షేక్స్, మోషన్, వైబ్రేషన్‌లను కూడ ఎడ్జెస్ట్ చేస్తుంది.

అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లు సినిమాటిక్ మోడ్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారులను 30 fps, 24 fps వద్ద 4K క్యాప్చర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఆపిల్ iPhone 14 శాటిలైట్ ద్వారా క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS కలిగి ఉంది, కానీ, ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్‌లో క్రాష్ డిటెక్షన్ తీవ్రమైన కార్ క్రాష్‌ని గుర్తించి, వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులకు ఆటో డయల్ చేస్తుంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ప్రాణాపాయం నుంచి తప్పించగలదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 15 Pro Series : సరికొత్త ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 15ప్రో సిరీస్.. అవేంటో తెలుసా?