Subramanian Swamy: నెహ్రూ, వాజ్‭పెయి, మోదీలపై విమర్శలు

జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్‌లు చైనాలో భాగమయ్యాయి. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఈరోజు రస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించుకుంది. ఇంత జరగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతన్నారు

Subramanian Swamy: నెహ్రూ, వాజ్‭పెయి, మోదీలపై విమర్శలు

Subramanian Swamy: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరోమారు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రధానమంత్రులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం గమనార్హం. టిబెట్, తైవాన్ అంశాలను ప్రస్తావిస్తూ మాజీ ప్రధానమంత్రులు Jawaharlal Nehru (జవహార్‭లాల్ నెహ్రూ), Atal Bihari Vajpayee (అటల్ బిహారీ వాజ్‭పెయి) సహా ప్రస్తుత Prime minister Narendra Modi (ప్రధానమంత్రి నరేంద్రమోదీ)లపై విమర్శలు గుప్పించారు. నెహ్రూ, వాజ్‭పెయిల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ ప్రాంతాలు చైనాలో చైనాలో భాగమయ్యాయని అన్నారు. అలాగే వాస్తవాదీన రేఖ ఒప్పందాన్ని చైనా గౌరవించుకుండా లద్ధాఖ్‭లో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పటికీ మన భూభాగంలోకి ఎవరూ రాలేదంటూ మత్తులో ఉన్నట్లుగా మోదీ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

బుధవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘‘జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్‌లు చైనాలో భాగమయ్యాయి. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఈరోజు రస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించుకుంది. ఇంత జరగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతన్నారు’’ అని ట్వీట్ చేశారు. దీనికి చివర్లో ‘‘మనకు ఎన్నికలు ఉన్నాయని చైనా తెలుసుకోవాలి’’ అంటూ ఆయన చెప్పుకురావడం విశేషం.

Punjab: సీఎం అంగీకారంతో నిరసన విరమించిన రైతులు