ICC ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌పై గంగూలీ కీలక వ్యాఖ్యలు.. సెమీస్‌కు చేరే జట్లు అవేనట..

మెగాటోర్నీలో సెమీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా - పాకిస్థాన్ జట్లు తలపడితే చూడాలని ఉందని మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ అన్నారు.

ICC ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌పై గంగూలీ కీలక వ్యాఖ్యలు.. సెమీస్‌కు చేరే జట్లు అవేనట..

Sourav Ganguly

Sourav Ganguly: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్ (ICC Men’s World Cup 2023 )  ప్రారంభం కానుంది. ఇండియా (India) లోని పది మైదానాల్లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్‌సైతం విడుదలైంది. వన్డే వరల్డ్ కప్  (ODI World Cup) లో విజేతగా నిలిచేందుకు టీంలు కసరత్తును ప్రారంభించాయి. అయితే, పలువురు మాజీ క్రికెటర్లు భారత్ వేదికగా జరిగే మెగాటోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ( Former India cricketer Sourav Ganguly) ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలిపాడు. వచ్చే వరల్డ్ కప్‌లో సెమీస్‌కు వెళ్లే అవకాశం ఏ జట్లకు ఉందో చెప్పారు.

Ashes 2023 : బ‌జ్‌బాల్ దెబ్బ‌.. ఆసీస్ అబ్బా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. సిరీస్ ఆశ‌లు స‌జీవం

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ జట్లు సెమీస్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయితే, పెద్దపెద్ద టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టును ఎప్పటికీ అంచనా వేయలేమని అన్నారు. ఆ జట్టుకు కూడా సెమీస్ కు చేరే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పాకిస్థాన్ జట్టుకూడా సెమిస్ కు చేరే అవకాశం ఉంటుందని దాదా చెప్పారు. పాక్ ఒకవేళ సెమీస్ కు వెళితే ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని గంగూలీ పేర్కొన్నారు.

BCCI New Rules : బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. క్రికెట్‌లో కొత్త రూల్‌.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధ‌న‌లో స్వ‌ల్ప మార్పు

గతంలో పలుసార్లు ప్లాన్ సరిగాఅమలు చేయలేకపోవటం వల్ల టీమిండియా మెగాటోర్నీల్లో నాకౌట్ దశలోనే వెనక్కు వచ్చిన విషయాన్ని గుర్తుచేసిన గంగూలీ.. ఈసారి మాత్రం భారత్ జట్టు ఖచ్చితంగా నాకౌట్ దశను దాటుతుందన్న విశ్వాసం ఉందని చెప్పారు. అయితే, వచ్చే మెగా టోర్నీలో సెమీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా – పాకిస్థాన్ జట్లు తలపడితే చూడాలని ఉందని సౌరవ్  గంగూలీ తన ఆశను వెలుబుచ్చాడు.