Margaret Alva : నేడు నామినేషన్‌ వేయనున్న విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా

లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కు మార్గరెట్ ఆళ్వా నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి 17 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపగా... మొత్తం 19 పార్టీలు మద్దతు తెలిపాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఇవాళ్టిలో నామినేషన్ల గడువు ముగియనుండటంతో... మార్గరెట్‌ అల్వా నామినేషన్‌ వేయనున్నారు.

Margaret Alva : నేడు నామినేషన్‌ వేయనున్న విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా

Margaret Alva

Margaret Alva : ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్‌ అల్వా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కు మార్గరెట్ ఆళ్వా నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి 17 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపగా… మొత్తం 19 పార్టీలు మద్దతు తెలిపాయి.

ఉపరాష్ట్రపతి పదవికి ఇవాళ్టిలో నామినేషన్ల గడువు ముగియనుండటంతో… మార్గరెట్‌ అల్వా నామినేషన్‌ వేయనున్నారు. మార్గరెట్‌ అల్వా ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎన్డీయే అభ్యర్థిగా జగ్‌దీప్‌ ధన్‌కడ్ నిన్న నామినేషన్ వేశారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు ఇతర నేతలతో కలిసి జగ్‌దీప్‌ వెళ్లారు.

vice president polls: విప‌క్ష పార్టీల ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. జులై 20న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. జులై 22 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63 లో పోలింగ్ జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

788 మంది ఎంపీలు ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా లోక్ సభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిసస్తూ ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.