Words Banned In Parliament: కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇక నుంచి పార్లమెంట్‌లో ఈ పదాలు వాడొద్దు..
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ, రాజ్య సభల్లో కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ తాజాగా కొత్త బుక్ లెట్ ను విడుదల చేసింది.

Pm Modi
Words Banned In Parliament: పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రతిపక్ష, అధికార పక్షం ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో మాట్లాడుకోవటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటికే కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో నిషేధం ఉంది. నిషేధంలో ఉన్న పదాలు వాడితే సదరు సభ్యులపై చర్యలు తీసుకొనే అధికారం సభాపతికి ఉంటుంది. తాజాగా మరికొన్ని పదాలను లోక్ సభ, రాజ్యసభల్లో సమావేశాలు జరిగే సమయంలో వాడొద్దంటూ నిషేధించారు. వాటిలో సిగ్గులేదు, నటన, అవినీతి, నాటకం అనే పదాలు కూడా ఉండటం గమనార్హం.
PM Modi: మోదీ హత్యకు కుట్ర.. బిహార్‌లో ఇద్దరు అరెస్టు
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ, రాజ్య సభల్లో కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ తాజాగా కొత్త బుక్ లెట్ ను విడుదల చేసింది. వీటిలో జుమ్లాజీవి, కొవిడ్ స్ర్పైడర్, స్నూప్ గేట్ వంటి పదాలు కూడా ఉన్నాయి. అంతేకాక సాధారణంగా వాడే సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత అనే పదాలను కూడా ఉపయోగించవద్దని బుక్ లెట్ లో పేర్కొనడం గమనార్హం. పార్లమెంట్ నిషేధిత పదాల జాబితాలో.. శకుని, తానాషా, వినాశ పురుష్, ఖలిస్థానీ, ద్రోహ చరిత్ర, చంచా, చంచాగిరి, పికిరివాడు, క్రిమినల్, మొసలి కన్నీళ్లు, గాడిద, అసమర్థుడు, గూండాలు, అహంకారి, చీకటి రోజులు, దాదాగిరి, లైంగిక వేధింపులు, విశ్వాస ఘాతకుడు వంటి పదాలను కూడా సభ్యులు తమ ప్రసంగాల్లో ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే.. రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.
Yashwant Sinha: ద్రౌపది ముర్ముకు తెదేపా మద్దతుపై యశ్వంత్ సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదిలాఉంటే బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, చంచా, చంచాగిరి, కరప్ట్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, అన్‌ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్ వంటి ఆంగ్ల పదాలను ఇందులో చేర్చారు. అసత్య, అహంకార్, గిర్గిట్, గూన్స్, అప్‌మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వినాశ్ పురుష్, ఖలిస్తానీ, ఖూన్ సే ఖేతీ, బాల్‌బుద్ధి వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో ఉన్నాయి. అయితే ప్రజలు నిత్యం వాడే చిన్నచిన్న పదాలనుసైతం పార్లమెంట్, రాజ్యసభల్లో వాడొద్దంటూ నిషేధం విధించడం పట్ల పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగ్గుచేటు, వేధింపులు, మోసం, అవినీతి అనేవి సర్వసాధారణ పదాలు అని, వాటిని నిషేధించడం సరికాదని పేర్కొంటున్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఈ వ్యవహారంపై స్పందించారు. సాధారణ పదాలను వాడొద్దంటే ఎలా?.. కావాలంటే నన్ను సస్పెండ్ చేయండి, ప్రజాస్వామ్యం కోసం పోరాడతా అంటూ ఓబ్రెయిన్ పేర్కొన్నారు.
https://twitter.com/derekobrienmp/status/1547407541788762112?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1547407541788762112%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Ffrom-corrupt-to-jumlajeevi-words-banned-in-parliament-cue-backlash-3156102