గాల్వాన్ లోయ..అటు వెయ్యి మంది..ఇటు వెయ్యి మంది, ఏం జరగనుంది ? 

  • Published By: madhu ,Published On : June 23, 2020 / 02:27 AM IST
గాల్వాన్ లోయ..అటు వెయ్యి మంది..ఇటు వెయ్యి మంది, ఏం జరగనుంది ? 

గాల్వాన్ లోయలో చైనా సైనికులు జరిపిన దాడిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘర్షణలో 20 మంది ఇండియన్ జవాన్లు వీరమరణం పొందడంపై ప్రతికారం తీర్చుకొనే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం గాల్వాన్ లోయ వద్ద అటు వెయ్యి మంది ఇటు వెయ్యి మంది మోహరించి ఉన్నారు.

పాంగాంగ్ సరస్సు వద్ద ఇరుపక్షాలు సైన్యాన్ని మోహరిస్తున్నాయి. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఎలాంటి హింస జరగలేదు కానీ…భారీ బలగాల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. 

చైనా ఒకవేళ అదే రీతిలో స్పందిస్తే..మాత్రం ధీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం స్కెచ్ వేస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి..మరో ప్రాంతంలోనూ సైనికుల మోహరింపు వల్ల డ్రాగన్ (చైనా)పై వత్తిడి పెరుగుతుందని, ఫలితంగా లద్దాఖ్ అంశంపై జరిగే చర్చల్లో ఇది భారత్ కు సానుకూల పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తోంది. ఉద్రిక్తతలను సడలించేందుకు ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్ స్థాయి సైనికాధికారుల ఆధ్వర్యంలో 2020, జూన్ 22వ తేదీ సోమవారం చర్చలు జరిగాయి. 

పాంగాంగ్ సరస్సు వద్ద 8 ఫింగర్లుగా విభజించారు. పర్వతాలు ఒక విధంగా ఉండడాన్ని ఫింగర్లుగా పేర్కొంటుంటారు. ఫింగర్ 1 నుంచి 4 మధ్య ఉన్న ప్రాంతం భారత నియంత్రణలో ఉండేది. ఆ తర్వాత భాగం చైనా అదుపులో ఉంది. ఫింగర్ 8 వరకు తమదేనన్నది భారత్ వాదన. ఫింగర్ 4 వద్ద భారత్ సైనిక దళాలు మోహరించాయి.

ఇక్కడ కూడా చైనా సైనికులు ఉన్నారు. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య ఉన్న ప్రాంతంలో భారీగా తిష్ట వేశాయి. భారత బలగాల ఉన్న ప్రాంతంలో భారీగా చైనా సైన్యం ఉండడంతో వివాదం పరిష్కారం కావడం లేదు.  

Read: చైనా ఆదేశాల ప్రకారమే భారత సైనికులపై క్రూర దాడి, అమెరికా ఇంటెలిజెన్స్