Google Loan Apps : ప్లే స్టోర్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన.. భారత్‌లో 3500 లోన్ యాప్స్ తొలగించిన గూగుల్..!
Google Loan Apps : ప్లే స్టోర్ గైడ్‌లైన్స్ ఉల్లంఘించిన లోన్ యాప్‌లపై గూగుల్ చర్యలు చేపట్టింది. భారత్‌లో 3500 లోన్ యాప్స్ తొలగించింది.

Google removes 3500 loan apps in India for misleading users, violating Play Store guidelines
Google Loan Apps : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్‌లో లోన్ యాప్స్ వాడుతున్నారా? గూగుల్ కొన్ని లోన్ యాప్స్ ప్లే స్టోర్ (Play Store) నుంచి తొలగించింది. గూగుల్ ప్లే స్టోర్ గైడ్‌లైన్స్ ఉల్లంఘించినందుకు ఆయా లోన్ యాప్స్‌ను తొలగించింది. ప్లే స్టోర్‌లో (Google Play Store)లో చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. లోన్ ఇస్తామని వినియోగదారులను నమ్మించి మోసగించేవి ఎక్కువగా ఉన్నాయి. అన్ని యాప్స్ చట్టబద్ధమైనవి కావని గమనించాలి.
కొన్నిసార్లు ధృవీకరణ లేకుండా ఈ యాప్స్ ఉపయోగించడం ద్వారా యూజర్లు ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అలాంటి లోన్ యాప్స్ వలలో వినియోగదారులు పడకుండా ఉండేందుకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ప్లే ప్రొటెక్ట్ రిపోర్ట్ ప్రకారం.. (Google Play) స్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 2022లో భారత్‌లో 3,500 కన్నా ఎక్కువ లోన్ యాప్‌లపై చర్య తీసుకుంది. గూగుల్ ఈ యాప్‌లను యాప్ స్టోర్ నుంచి తొలగించింది.
2021లో, వ్యక్తిగత రుణాలను అందించే వాటితో సహా భారత్‌లో ఆర్థిక సేవల యాప్‌లకు గూగుల్ కొత్త విధానాన్ని అప్‌డేట్ చేసింది. ఈ విధానం సెప్టెంబర్ 2021 నుంచి అమల్లోకి వచ్చింది. యాప్ డెవలపర్‌లు వ్యక్తిగత రుణాలను అందించడానికి, లైసెన్స్ కాపీని సమర్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా లైసెన్స్ పొందినట్లు ధృవీకరించాలి. లైసెన్స్ పొందకపోతే.. లైసెన్స్ పొందిన రుణదాతలకు రుణాలు అందించడానికి మాత్రమే ప్లాట్‌ఫారమ్‌లో ధృవీకరించాలి. డెవలపర్‌లు తమ డెవలపర్ అకౌంట్ పేరు వారి డిక్లరేషన్ ద్వారా అందించిన రిజిస్టర్డ్ బిజినెస్ పేరుతో సరిపోలినట్లు నిర్ధారించుకోవాలి.
2022లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), బ్యాంకులకు ఫెసిలిటేటర్‌లుగా వ్యక్తిగత రుణాలను అందించే యాప్ డెవలపర్‌లు తమ వివరాలను తప్పక అందించాలని సూచించింది. డెవలపర్‌లు తమ పార్టనర్ NBFCలు, బ్యాంకుల పేర్లను యాప్ వివరణలో బహిర్గతం చేయాలి. అధికారిక ఏజెంట్‌లుగా లిస్టు చేసిన వారి సంబంధిత వెబ్‌సైట్‌లకు లైవ్ లింక్‌ను అందించాలి. పర్సనల్ లోన్ యాప్ డిక్లరేషన్‌లో భాగంగా ఉండాలి. కేవలం భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా యూజర్ కాంటాక్టులు లేదా ఫొటోలకు యాక్సస్ పొందడం ద్వారా వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఇలాంటి యాప్‌లపై గూగుల్ చర్యలు తీసుకుంది. ఇకపై, లోన్ యాప్‌లు.. యూజర్ల ఫొటోలు, కాంటాక్టుల వంటి సున్నితమైన డేటాను యాక్సెస్ చేయలేవు.

Google removes 3500 loan apps in India for misleading users
ప్లే స్టోర్‌లోని అన్ని యాప్‌లు వాటి నియమాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. గూగుల్ తన విధానాలు, రివ్యూ ప్రక్రియలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తోంది. కొన్ని యాప్స్ యూజర్లను లోన్ల పేరుతో మోసగించే ప్రయత్నం చేస్తుంటాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, లెండింగ్ యాప్‌ని ఉపయోగించే ముందు పూర్తిగా చెక్ చేయాలి. యూజర్ల రివ్యూలను కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. యాప్ సంబంధిత కంట్రోల్ సంస్థలతో రిజిస్టర్ అయిందో లేదో చెక్ చేయాలి. ఏదైనా అంగీకరించే ముందు రూల్స్, కండిషన్స్ జాగ్రత్తగా చదవండి.