IN-SPACE తో భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు, రోదసిలో ప్రయోగాలకు ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అనుమతి

భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు రాబోతున్నాయా... రోదసిలో ఇప్పటికే ప్రపంచదేశాల సరసన

IN-SPACE తో భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు, రోదసిలో ప్రయోగాలకు ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అనుమతి

భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు రాబోతున్నాయా… రోదసిలో ఇప్పటికే ప్రపంచదేశాల సరసన

భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు రాబోతున్నాయా… రోదసిలో ఇప్పటికే ప్రపంచదేశాల సరసన విజయపతాకం ఎగరవేసిన భారత్.. రాబోయే కాలంలో అగ్రగామిగా ఎదుగుతుందా..ఎందుకంటే..కేంద్రం కొత్తగా ఈ రంగంలో సంస్కరణలకు తెర తీయడమే కారణం. ప్రవేట్ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇన్ స్పేస్ సంస్థని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆకాశంలో ప్రయోగాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయ్.

భారత అంతరిక్ష విభాగంలో సంస్కరణలకు కేంద్రం గ్రీన్ ‌సిగ్నల్:
భారత అంతరిక్ష విభాగంలో సంస్కరణలకు కేంద్రం గ్రీన్ ‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఆకాశమే హద్దుగా ప్రయోగాలు మొదలవుతాయనే అంచనాలు నెలకొన్నాయ్. బుధవారం కేంద్రమంత్రి వర్గం ఇండియన్ నేషనల్ స్పేస్ డెవలప్‌మెంట్ సెంటర్.. ఇన్-స్పేస్ ఏర్పాటుకి ఆమోదం తెలపడంతో స్పేస్‌లో ఎక్స్‌పెరిమెంట్స్‌కి ప్రవేట్ సంస్థలకు అనుమతి లభించినట్లైంది.

అంత‌రిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థ‌లు:
అంత‌రిక్ష రంగంలో ప్రైవేటు సంస్థ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ఇన్ స్పేస్ మార్గ‌నిర్దేశం వ‌హించనుండగా.. ఇప్పటికే ఉన్న ఇస్రో సహా ఇతర సంస్థలకు ప్రవేట్ కంపెనీల ఆగమనం కలిసి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇదే సమయంలో ఇస్రో మనుగడకి వచ్చిన ఇబ్బందేం లేదని..ఇస్రో..ఇన్ స్పేస్ రెండూ కలిసే అంతరిక్షంలో ప్రయోగాలు నిర్వహిస్తాయని కేంద్రం క్లారిటీ ఇచ్చింది..అంతరిక్ష విభాగంలో ఇదో కొత్త మలుపుగా కేంద్రం చెప్తోంది. వాస్తవానికి గత ఏడాది కాలంగా ప్రవేట్ సంస్థలను స్పేస్ బిజినెస్‌లోకి తీసుకు వస్తారంటూ ప్రకటనలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు..ఇప్పుడు కేంద్రం ఓ ప్రత్యేకమైన సంస్థనే ఏర్పాటు చేయడంతో.. భారత అంతరిక్ష ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం కన్పిస్తోంది.

నిర్ణయాధికారం మాత్రం ఇస్రోకే:
ఐతే ఇస్రో కానీ..ఇన్ స్పేస్ కానీ రెండు ప్రత్యేక సంస్థలుగానే కొనసాగనున్నాయని కేంద్రం ప్రకటించింది..ఇస్రో పరిధిలోని ప్రాజెక్టులు మిషన్లు ఇకపైనా ఇస్రో పరిధిలోనే కొనసాగనున్నాయ్. ఐతే ప్రవేట్ సంస్థలకు రోదసిలో ప్రయోగాలకు అనుమతి ఇచ్చినా కూడా ..నిర్ణయాధికారం మాత్రం ఇస్రోకే ఉంటుంది.

Read: Google నుంచి లోకషన్ హిస్టరీ ఆటోమెటిక్ గా Delete