Dahi Kachori : కుటుంబం ఆకలి తీర్చటానికి..‘ద‌హీ క‌చోరీ’అమ్ముతున్న బాలుడు..

కుటుంబం సభ్యుల ఆకలి తీర్చటానికి..ఇంజనీర్ అవ్వాలనే తన కల నెరవేర్చుకోవటానికి 14 ఏళ్ల బాలుడు కచోరీలు అమ్ముతున్నాడు. ఆ పిల్లాడి కష్టానికి ఫిదా అయిన జనాలు ఎక్కడెక్కడినుంచో వచ్చి..

Dahi Kachori : కుటుంబం ఆకలి తీర్చటానికి..‘ద‌హీ క‌చోరీ’అమ్ముతున్న బాలుడు..

Boy Sells Dahi Kachori In Ahmedabad

Gujarath boy sells dahi kachori  :ఒక్కో మనిషికీ ఒక్కో రకమైన కష్టం. ఇంటింకో చరిత్ర..కూటికి లేని పేదల నుంచి కోట్లకు పడగలెత్తిన వారి వరకు ఏదోక సమస్య ఉంటునే ఉంటుంది. కోట్లున్నవారు స్టేటస్ కోసం కష్టపడితే..కూటికి లేనివారు తిండికోసం కష్టపడుతుంటారు. అలా పట్టుమని 15 ఏళ్లుకు కూడా లేని 14పిల్లాడు కుటుంబం కోసం నడిరోడ్డుమీద ‘కచోరీ’ అమ్ముకుంటున్నాడు. ఆ పిల్లాడి కష్టం గురించి తెలుసుకున్న జనాలు..ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి కచోరీ కొని సహాయం చేస్తున్నారు. అంత కష్టం పడుతున్న ఆ పిల్లాడికి ఆదుకోవాలని కోరుతున్నారు.

కూటికి పేదకానీ గుణానికి పేద కాదు అనేలా ఆత్మాభిమానంతో జీవించేవారు తమ కష్టాన్నే నమ్ముకుంటారు. అలా ఎంతోమంది చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఏదోరకంగాకష్టపడుతున్న జీవిస్తున్నారు. వారి కుంటుంబాలకు ఇంత అన్నం పెడుతున్నారు. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకునే వయస్సులో కూడా కష్టపడేవారిని ఎంతోమందిని చూశాం. అలాగే కరోనా కష్టంలో చదువు మానేసి టీలు,కూరగాయాలు, పండ్లు, చీపుర్లు అమ్ముకునే పిల్లల్ని చూశాం.

అటువంటి కష్టమే గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన తన్మయ్ అగర్వాల్ అనే 14ఏళ్ల బాలుడు రోడ్డుమీద నిలబడి ‘దహి కచోరీ’లు అమ్మేలా చేసింది. అహ్మదాబాద్ లోని మ‌ణిన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ద‌హీ క‌చోరీ బండి పెట్టుకున్నాడు 14 ఏళ్ల బాలుడు. చ‌దువుకునే వ‌య‌సులో ఇలా రోడ్డుమీద ఇలా ఏంటీ మీ అమ్మానాన్న ఏం చేస్తారు.. ఆ బాలుడిని అడిగితే ఓ సుదీర్ఘ కష్టమే కనిపించింది ఆ పిల్లాడి వెనుక.

Read more : బాబా కా ధాబాకు వెళ్లి తినండి.. ఆ దంపతుల కన్నీళ్లు తుడవండి

ఆ పిల్లాడి దగ్గర కచోరీలు తినటానికి వచ్చిన విశాల్ ప‌రేఖ్ అనే వ్య‌క్తి ఆ బాలుడి ప‌రిస్థితి తెలుసుకున్నాడు. అతను చెబుతుంటే వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు.. ద‌య‌చేసి అక్క‌డి స్థానికులు ఆ బాలుడిని ఆదుకోవాల‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోను చూసిన స్థానికులు ఆ బాలుడి క‌చోరీ బండి వ‌ద్ద‌కు వెళ్లి క‌చోరీలు తిని ఆ పిల్లాడికి బేరాలు లేవనే కష్టం లేకుండా చేస్తున్నారు. దీంతో ఆ బాలుడు ఫుల్ ఖుషీ అవుతున్నాడు. వీడియో వైర‌ల్ అవ్వ‌డం వ‌ల్లే రోజూ గిరాకీ పెరుగుతోంద‌ని ఆ బాలుడు తెలిపాడు.

ఇంజనీర్ కావాలని తన్మయ్ కల. కానీ పేద కుటుంబం. పైగా కరోనా కష్టం. గతంలో తల్లిదండ్రులకు సహాయంగా ఉండేవాడు కచోరీలు అమ్మటంలో. ఇప్పుడు తల్లిదండ్రులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో అక్క తాను కలిసి కచోరీలు, దానికి కావాల్సిన మిక్సిడ్ ఐటెమ్స తయారు చేసి రోడ్డుమీద అమ్ముతుంటాడు తన్మయ్. వ్యాపారం సమయం అయ్యాక ఇంటిలో చదువుకుంటుంటాడు. తన ఇంజనీరింగ్ కల నెరవేర్చుకోవటానికి.

Read more : లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చిన వ్యక్తిపై బాబాకా ధాబా ఓనర్ కంప్లైంట్

ఏదో డబ్బులు సహాయం చేస్తే ఒకరోజుతోనే పోతుంది. పైగా ఆత్మాభిమానం ఉన్నవారు జాలిపడి డబ్బులిస్తే అస్సలు తీసుకోరు. కానీ వారు పడే కష్టానికి కాస్తంత తోడుగా సపోర్టు ఇస్తే మా కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది అని తృప్తి పడతారు.గతంలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి. ‘బాబా ద ధాబా’వంటి కథనాలు సోషల్ మీడియా వేదికగానే వెలుగులోకి వచ్చింది. అలా సోషల్ మీడియా పుణ్యమాని ఎంతోమంది కష్టం..ప్రతిభ వెలుగులోకి వస్తున్నాయి.

సోషల్ మీడియాలో తన్మయ్ కథనం తెలిసిన ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి కచోరీలు కొంటున్నారు. అతనితో సెల్ఫీలు దిగుతుంటారు. దీంతో గతంలో తాను తెచ్చిన కచోరీలు పూర్తిగా అమ్ముడు కాక ఇంటికి తిరిగి తీసుకెళ్లిపోయేవాడు. కానీ ఇప్పుడలా కాదు..సోషల్ మీడియాలో తన్మయ్ గురించి తెలిసి మంచి గిరాకీలు వస్తున్నాయి. దీంతో తెచ్చిన కచోరీలన్ని అమ్ముడైపోతున్నాయని తన్మయ్ తెగ సంతోషపడిపోతున్నాడు.

Read more : Baba Ka Dhaba Owner : బాబా కా దాబా ఓనర్ ఆత్మహత్యాయత్నం