Commonwealth Games 2022: మరో పతకం వచ్చింది.. కాంస్య పతకాన్ని దక్కించుకున్న పుజారా.. ప్రధాని మోదీ అభినందన

బర్మింగ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వరుసగా రెండు పతకాలను భారత్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు.

Commonwealth Games 2022: మరో పతకం వచ్చింది.. కాంస్య పతకాన్ని దక్కించుకున్న పుజారా.. ప్రధాని మోదీ అభినందన

Gujaral

Commonwealth Games 2022: బర్మింగ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వరుసగా రెండు పతకాలను భారత్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. శనివారం 55 కేజీల విభాగంలో సంకేత్ రజత పతకంతో పతకాల వేటలో భారత్ ఖాతాను ఓపెన్ చేయగా.. 61 కేజీల కేటగిరిలో గురురాజ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు.

61 కేజీల కేటగిరిలో మొత్తం 269(118కిలోలు + 151కిలోలు)తో ముగించి మూడో స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జెర్క్ లో 151 కేజీలు, స్నాట్చ్ లో 118 కేజీలు ఎత్తాడు. కెనడా వెయిట్ లిఫ్టర్ యూరి సిమర్ధ్ నుంచి గురురాజకు తీవ్ర పోటీ ఎదురైంది. ఇదిలాఉంటే భారత్‌కు రెండో పతకాన్ని అందించిన గురురాజాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని, నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ.. “పి. గురురాజా కాంస్య పతకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది! అతనికి అభినందనలు. అతను గొప్ప సంకల్పాన్ని ప్రదర్శించాడు. అతని క్రీడా ప్రయాణంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అంతకుముందు 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్యం సాధించిన సంకేత్ సర్గర్ ను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ వేదికగా అభినందించారు. అసాధారణ ప్రయత్నం! అతను ప్రతిష్టాత్మక రజతం సాధించడం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు గొప్ప ప్రారంభం. సంకేత్ కు అభినందనలు, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.