Health Minister : ‘వ్యాక్సిన్‌ తీసుకుని..ప్రధాని మోడీకి పుట్టినరోజు బహుమతిగా ఇద్దాం’

ప్రధానికి ఇచ్చే పుట్టిన రోజు సందర్భంగా ‘అందరు వ్యాక్సిన్ వేయించుకుందాం..అదే మోడీకి మనం ఇచ్చే బహుమతి’ అంటూ కేంద్రం ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్‌ మాండవ్య ప్రజలకు పిలుపునిచ్చారు.

Health Minister : ‘వ్యాక్సిన్‌ తీసుకుని..ప్రధాని మోడీకి పుట్టినరోజు బహుమతిగా ఇద్దాం’

Happy Birthday Modi Ji

Health Minister’s Vaccine Push To Mark PM’s Birthday : ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కేంద్రం ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్‌ మాండవ్య ప్రజలకు ఓ వినూత్న పిలుపునిచ్చారు. కరోనాను అరికట్టటానికి అందరు వ్యాక్సిన్ వేయించుకుందాం..అదే మనమంతా ప్రధానికి ఇచ్చే పుట్టిన రోజు బహుమతి అంటూ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఇంకా ఎవరైన కోవిడ్‌ -19 వ్యాక్సిన్‌ తీసుకోని వాళ్లు ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వ్యాక్సిన్‌ తీసుకున్ని దాన్ని గిఫ్గ్‌గా ఇవ్వండంటూ…ప్రజలను ఆరోగ్య మంత్రి కోరారు.

Read more : Covid-19 Vaccine: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు..!

బీజేపీ మోడీ జన్మదినోత్సం సందర్బంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో చారిత్రక రికార్డు సృష్టించాలని భావిస్తోంది. దీంట్లో భాగంగానే శుక్రవారం (సెప్టెంబర్ 17)ఒక్కరోజే దాదాపు ఎనిమిది లక్షల మంది వాలంటీర్‌లతో రెండు కోట్టకు పైగా వ్యాకిన్‌నేషన్‌ ప్రక్రియను చేపట్టి విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మోడీ 20 ఏళ్ల ప్రజా సేవకు గ్తురుగా “సేవా సమర్పణ అభియన్‌” అనే పేరుతో 20 రోజుల మోగా ఈవెంట్‌ నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా..మోడీకు శుభం జరగాలనీ..తద్వారా ప్రజలకు కూడా మేలు జరగాలనే కోరుతు పలు సేవకార్యక్రమాలను చేపట్టింది. ఈ విషయాలను బీజేపీ నేతలు చెబుతున్నారు.

Rear more : Zycov-D : భారత్ లో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్

దీంట్లో భాగంగానే కరోనాను నియంత్రించటానికి తీసుకునే వ్యాక్సినేషన్ లో అందరూ భాగస్వాములు కావాలని..అపోహలు మానివేసి ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని..ఇప్పటికే దేశమంతా వ్యాక్సినేషన్ కార్యక్రమం గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేయించుకోని వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని అదే మనం ప్రధాని మోడీకి ఇచ్చే అసలైన బహుమతి అని కోరారు ట్విట్టర్ వేదికగా..