Hyderabad : కుండపోత వర్షం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, కేపిహెచ్‌బీ, మూసాపేట్‌ రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై చేరింది.

Hyderabad : కుండపోత వర్షం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!

Rain In Hyderabad

Hyderabad : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, కేపిహెచ్‌బీ, మూసాపేట్‌ రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, ఆరంఘార్ మెహదీపట్నం, టోలిచౌకి, మాసబ్‌ట్యాంక్, నాంపల్లిలో కుండపోత వర్షం కురిసింది. హైటెక్‌సిటీ టు కేపీహెచ్బీ మార్గంలో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపు రెండు కిలో మీటర్ల వరకూ వాహనాలు నిలిచిపోయాయి. ఫోరమ్ మాల్ ఫ్లైఓవర్ వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసాపేట, అమీర్ పేట మధ్యకూడా రోడ్డుపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టోలిచౌకి వద్ద రోడ్లపై వరద పారుతోంది.

Read More :  MAA Election: ‘మా’ ఎన్నికలలో ఎమ్మెల్యే రోజా ఓటెవరికి?

కూకట్‌పల్లిలో 12 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఫలక్నామ, జూపార్క్ ప్రాంతాల్లో 13 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. భారీ వర్షానికి ట్రాఫిక్ జాం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక వర్షం ఎక్కువగా పడుతుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు మాన్సూన్ బృందాలను అప్రమత్తం చేశారు.

Read More : Kerala : కేరళలో తగ్గని కోవిడ్ ఉధృతి..కొత్తగా 11వేల కేసులు,120 మరణాలు

మరికొద్ది గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు తెలియచేయాలని సూచించారు. భారీ వర్షం, గాలుల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ జి రఘుమా రెడ్డి.. చీఫ్ ఇంజినీర్ల, సుపరెంటెండింగ్ ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్ లైన్స్, స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్ చేయాలనీ తెలిపారు. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104 కాల్ చెయ్యాలని రఘుమా రెడ్డి తెలిపారు.