Telangana Rains : రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.

Telangana Rains : రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Telangana Rains (5)

Heavy Rains Yellow Alert : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జులై 13 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. జులై 12, 13 తేదీల్లో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. మరోవైపు ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సెంట్రల్ ఢిల్లీ, నోయిడా, గురుగావ్ లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

Heavy Rains : ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. ఆ 12 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

40 ఏళ్ల తరువాత ఒక్క రోజులో భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి. పగలు, రాత్రి నిర్విరామంగా వర్షం కురుస్తోంది.