Heroins : యాక్షన్ సినిమాలతో అదరగొడుతున్న హీరోయిన్లు..

ఏదో సినిమాలో అప్పుడప్పుడు కనిపించే రోల్స్ కాదు, సినిమా మొత్తం తమ మీదనే నడిపిస్తున్నారు హీరోయిన్లు. హీరో సెంట్రిక్ సినిమాగా ఉన్న ఒకప్పటి ఇండస్ట్రీని ఇప్పుడు హీరోయిన్లు ఓవర్ టేక్ చేస్తున్నారు. హీరోలతో సమానంగా యాక్టింగే కాదు, యాక్షన్ తో దుమ్ము రేపుతున్నారు. సినిమాలో................

Heroins : యాక్షన్ సినిమాలతో అదరగొడుతున్న హీరోయిన్లు..

Heroins doing continue action movies

Heroins :  ఏదో సినిమాలో అప్పుడప్పుడు కనిపించే రోల్స్ కాదు, సినిమా మొత్తం తమ మీదనే నడిపిస్తున్నారు హీరోయిన్లు. హీరో సెంట్రిక్ సినిమాగా ఉన్న ఒకప్పటి ఇండస్ట్రీని ఇప్పుడు హీరోయిన్లు ఓవర్ టేక్ చేస్తున్నారు. హీరోలతో సమానంగా యాక్టింగే కాదు, యాక్షన్ తో దుమ్ము రేపుతున్నారు. సినిమాలో అప్పుడప్పుడు వచ్చి ఆడియన్స్ కి కనిపించే క్యారెక్టర్స్ నుంచి సినిమాకే హైలెట్ గా నిలిచే క్యారెక్టర్లు చేస్తూ, సినిమాని శాసిస్తున్నారు హీరోయిన్లు . స్పెషల్లీ నార్త్ లో సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు హీరోయిన్లు. కమర్షియల్ సినిమాలో కూడా తమ స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకుంటూనే యాక్షన్ తో కూడా అదరగొడుతున్నారు. హీరోలతో సమానంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.

షారూఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి ధీటుగా యాక్షన్ తో అదరగొడుతోంది దీపికా పదుకోన్. ఆల్రెడీ ట్రిపుల్ ఎక్స్ లాంటి హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో హైరేంజ్ యాక్షన్ చేసిన దీపికా మరోసారి ఆడియన్స్ కి యాక్షన్ ఫీస్ట్ ఇవ్వబోతోంది. షారూఖ్ ఖాన్ హీరోగా వస్తున్న పఠాన్ లో షారూఖ్ తో పాటు అటెన్షన్ గ్రాబ్ చేసింది దీపికా పదుకొనె. 15 ఏళ్ల పాటు డిఫరెంట్ జానర్స్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన దీపికా ఈసారి యాక్షన్ తో దుమ్ములేపుతోంది. పఠాన్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ తో అందర్నీ సర్ ప్రైజ్ చేసింది. పఠాన్ తో పాటు హృతిక్ రోషన్ తో చేస్తున్న ఫైటర్ లో కూడా యాక్షన్ సీన్స్ తో అదరగొట్టబోతోంది దీపికా.

మరో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ యాక్షన్ ధూమ్ సినిమా టైమ్ నుంచే చేస్తోంది. అప్పటి నుంచే హీరోలతో పాటు స్క్రీన్ స్పేసే కాకుండా యాక్షన్ ప్యాక్డ్ రోల్స్ తో అదరగొడుతోంది. టైగర్ జిందా హేతో ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ చేసిన కత్రినా సల్మాన్ ఖాన్ తో చేస్తున్న టైగర్ 3 సిరీస్ లో పవర్ ఫుల్ యాక్షన్ తో మరోసారి ఫుల్ బ్యాంగ్ ఇవ్వబోతోంది.

హీరోయిన్లతో పాటు స్టార్ హీరోలకే గట్టిపోటీ ఇస్తోంది ఆలియాభట్. గంగూభాయ్ తో 100 కోట్ల కలెక్షన్లు సాధించి తన మార్కెట్ స్టామినాని కూడా చూపించింది. రాజీలోనే తన యాక్షన్ చూపించిన ఆలియా భట్ ఇప్పుడు సాలిడ్ యాక్షన్ చెయ్యబోతోంది. హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ లో కేయా క్యారెక్టర్ చేస్తున్న ఆలియా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో కనిపించబోతోంది.

కమర్షియల్ సినిమాలతో పాటు యాక్షన్ సినిమాలతో కూడా తన హవా నడిపిస్తోంది కంగనా. టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే హీరోలతో సమానంగా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేసింది కంగనా. ఫైర్ బ్రాండ్ కంగనా హీరోలతో పనిలేకుండా తన సినిమాల్ని సోలో గానే చేస్తోంది. రివాల్వర్ రాణి, మణికర్ణిక, లాంటి సాలిడ్ యాక్షన్ సినిమాలు చేసిన కంగనా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ధాకడ్ లో కంప్లీట్ యాక్షన్ యాంగిల్ తో అదరగొట్టింది. యాక్షన్ తో ఎప్పటి నుంచో హీరోలతో పోటీపడుతోన్న కంగనా తేజస్ తో మరోసారి సాలిడ్ యాక్షన్ మూవీకి రెడీ అవుతోంది.

నా సినిమాల్లో స్టార్ హీరోలెవరూ నటించరు అని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చిన తాప్సీ హీరోని పక్కన పెట్టేసి తనే హీరోయిజం చూపిస్తోంది. స్పోర్ట్స్, థ్రిల్లర్, ఆంథాలజీ ఇలా సాలిడ్ సినిమాలతో బాలీవుడ్ లో సోలోగానే మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్న తాప్సీ అంతకు ముందే నామ్ షబానా, అనబెల్లె, బేబీ లాంటి సినిమాల్లో యాక్షన్ చేసింది. ఇప్పుడు వో లడకీ హే కహా సినిమాలో కంప్లీట్ పోలీస్ క్యారెక్టర్ లో యాక్షన్ తో అదరగొట్టబోతోంది.

హైలీ గ్లామరస్ రోల్స్ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠానీ ఇప్పుడు గ్లామర్ నుంచి యాక్షన్ టర్న్ తీసుకుంది. సిద్దార్ద్ మల్హోత్రా, రాశిఖన్నా, దిశాపఠానీ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ యోధలో దిశా యాక్షన్ స్టంట్స్ తో సర్ ప్రైజ్ చేసింది. ఈ సీక్వెన్స్ కోసం స్పెషల్ ట్రెయినింగ్ కూడా తీసుకుంది దిశా.

బాలీవుడ్ లో వరస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కృతి సనన్ యాక్షన్ టర్న్ తీసుకుంది. టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జంటగా గన్ పథ్ ఫస్ట్ పార్ట్ లో సాలిడ్ యాక్షన్ సీన్స్ తో పాటు నెవర్ సీన్ బిఫోర్ లుక్ లో బుల్లెట్స్ తో బైక్ స్టంట్స్ చేస్తోంది. జెస్సీ క్యారెక్టర్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ క్యారెక్టర్ అంటోంది కృతి.

మరో వైపు రకుల్ ప్రీత్, రాశిఖన్నా కూడా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ కమర్షియల్ సినిమాలతో పాటు యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. వీరితో పాటు జాన్వికపూర్ కూడా కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూనే యాక్షన్ వైపు టర్న్ అవుతోంది. ఇక పరిణీతిచోప్రా కోడ్ తిరంగా అనే కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ తో పోలీస్ ఆఫీసర్ గా సాలిడ్ యాక్షన్ తో అదరగొట్టింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ వైజ్ టాప్ రేంజ్ లోఉన్న సమంత ఎంటర్టైన్మెంట్, విమెన్ సెంట్రిక్ మూవీస్ నుంచి వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ వరకూ ఇలా తన మార్కెట్ ని రోజురోజుకీ పెంచుకుంటోంది. వీటితో పాటు యాక్షన్ మూవీస్ కూడా చేస్తోంది సమంత. ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ 2 తో పాటు రీసెంట్ గా వచ్చిన యశోదలో యాక్షన్ తో దుమ్మురేపిన సమంత వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్ లో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సిటాడెల్ యాక్షన్ సిరీస్ లో మరోసారి యాక్షన్ పవర్ చూపించబోతోంది. ఈ సినిమాలో సమంత స్పై క్యారెక్టర్ చేస్తోంది.

సౌత్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర యాక్షన్ తో కూడా కాసులు కురిపిస్తోంది. ఇప్పటికే ఇంకొక్కడు, నెట్రికన్, అంజలి సిబిఐ లాంటి సినిమాల్లో యాక్షన్ తో అదరగొట్టిన నయనతార మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీతో రాబోతోంది.

మరో సౌత్ స్టార్ త్రిష వరసగా యాక్షన్ మూవీస్ తో అదరగొడుతోంది. పొన్నియిన్ సెల్వన్ లాంటి హిస్టారికల్ మూవీస్ చేస్తూనే విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తున్న త్రిష మరో వైపు శతురంగవిట్టైతో పాటు రాంగి మూవీలో పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ సీక్వెన్స్ తో హీట్ పెంచేసింది. అంతేకాదు బృంద వెబ్ సిరీస్ లో మరోసారి కాప్ రోల్ లో తన యాక్షన్ సత్తాచూపించబోతోంది.

Kalyan Ram : కొత్త కథలు, పాత్రల వైపు కళ్యాణ్ రామ్ ప్రయాణం..

సౌత్ హీరోయిన్ గా సినిమాలు చేసి బాలీవుడ్ కి కూడా వెళ్లింది రెజీనా. ఆల్రెడీ వెబ్ సిరీస్ లతో పాటు శాకిని ఢాకిని సినిమాలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ చేసిన రెజీనా లేటెస్ట్ గా జాన్ బాజ్ హిందుస్తాన్ లో పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ సీన్స్ తో తన పొటెన్షియాలిటీ చూపిస్తోంది. ఇలా హీరోయిన్లు గ్లామర్ తో సెటిల్ అయిపోకుండా ఫైటింగ్స్ తో కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ మొత్తానికి హీరో పక్కన నాలుగు సాంగ్స్ లో కనిపించే హీరోయిన్స్ యాక్షన్ తో సినిమా అంతా అదరగొడుతున్నారు.