Honour Killing : ప్రేమించినవాడితో వెళ్లిపోయిందని చెల్లెల్ని కాల్చి చంపిన అన్న

ప్రేమించిన వ్యక్తితో ఇంట్లోంచి వెళ్లిపోయిందనే ఆగ్రహంతో ఓ అన్న చెల్లెల్ని కిరాతకంగా కాల్చి చంపేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.

Honour Killing : ప్రేమించినవాడితో వెళ్లిపోయిందని చెల్లెల్ని కాల్చి చంపిన అన్న

Honour Killing

Honor Killing In UP : ఆడపిల్లల్ని ‘పరువు’గా భావించే సంస్కృతి సమాజంలో వేళ్లూనుకుపోయింది. తోడబుట్టిన అక్కగానీ..చెల్లెలు గానీ కులాంతర వివాహం చేసుకున్నా..నచ్చినవాడితో జీవితం పంచుకున్నా అన్నదమ్ములుగానీ..తండ్రి గానీ భరించలేరు. తమ పరువు పోయిందని భావిస్తారు. అటువంటి సమయంలో పరువు కాపాడుకుంటున్నాం అనే భ్రమలో కన్నబిడ్డల్ని..తోడబుట్టిన అక్కచెల్లెళ్లను కసాయివారిలో కడతేరుస్తున్న విష సంస్కృతి పెరిగిపోతోంది. ఈక్రమంలో ఓ అన్న తన చెల్లెలు ప్రేమించినవాడితో వెళ్లిపోయిందనే ఆగ్రహంతో చెల్లెలిని కాల్చి చంపేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాగా చెల్లెలు ప్రేమించిన యువకుడు దగ్గర బంధువే కావటం గమనించాల్సిన విషయం.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా చుర్ గ్రామంలో 16 ఏళ్ల అంజలి అనే అమ్మాయి గౌరవ్ అనే యువకుడిని ప్రేమించింది. దానికి అంజలి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు.దీంతో గౌరవ్ తో కలిసి పారిపోయింది. దీంతో అంజలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించగా ప్రియుడితో కలిసి జూన్ 13న కనిపించింది. వెంటనే బలవంతంగా అంజలిని ఇంటికి తీసుకొచ్చేశారు.

కానీ తండ్రీ అన్న ఏం చేస్తారోనని అంజలి భయపడుతూనే ఉంది. ఈక్రమంలో గత శనివారం (జూన్20,2021) ఇంట్లో పనిచేసుకుంటున్న అంజలిని అన్న శేఖర్ ‘ఇంట్లోంచి పారిపోయి మా పరువు తీస్తావా? అంటూ నాటు తుపాకీతో కలిసి చంపేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక మామ అమర్‌పాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపై ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ..గౌరవ్ అంజలి కుటుంబానికి దూరపు బంధువు అవుతాడనీ..వారితో కొన్ని విషయాల్లో వివాదం ఉండటంతో గౌరవ్ ను అంజలి ప్రేమించటం ఆమె కుటుంబానికి ఇష్టం లేదనీ ఈక్రమంలో ఆమెను ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయిందనే ఆగ్రహంతో ఆమెను అన్న కాల్చి హత్య చేశాడని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.