ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్ర స్థానంలో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ రిజ్వాన్ ను సూర్యకుమార్ యాదవ్ వెనకేశాడు. నిన్నటి వరకు టీ20 ర్యాంకుల్లో రిజ్వాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 863 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రిజ్వాన్ 842 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.

ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్ర స్థానంలో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్

ICC Rankings: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ రిజ్వాన్ ను సూర్యకుమార్ యాదవ్ వెనకేశాడు. నిన్నటి వరకు టీ20 ర్యాంకుల్లో రిజ్వాన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 863 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రిజ్వాన్ 842 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు 2021, మార్చి 14న ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచులో టీ20ల్లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది మొదట్లో మొదటి టీ20 సెంచరీ బాదాడు.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో నెదర్లాండ్స్, దక్షిణ ఆఫ్రికాలపై ఒక్కో అర్ధ సెంచరీ చేశాడు. ఇవాళ బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ కంటే ముందుకు వరకు సూర్యకుమార్ యాదవ్ మొత్తం 35 టీ20లు ఆడి, 1,179 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. టీ20 బౌలింగ్ ర్యాంక్సింగ్స్ లో అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షాకిబ్ అల్ హసన్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..