ICC T20 Rankings.. భారత్ నుంచి అతడొక్కడే..

టీ20 ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒక్క ప్లేయర్(కేఎల్ రాహుల్) మాత్రమే ఉన్నాడు.

ICC T20 Rankings.. భారత్ నుంచి అతడొక్కడే..

Icc T20 Rankings

ICC T20 Rankings : టీ20 ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒక్క ప్లేయర్(కేఎల్ రాహుల్) మాత్రమే ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్ అదరగొట్టాడు. 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 809 పాయింట్లతో టాప్ లో కొనసాగుతున్నాడు. 805 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ రెండో స్థానంలో ఉన్నాడు. 796 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ మూడో స్థానంలో నిలిచాడు. 735 పాయింట్లతో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

Smartphones: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లు

ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ 797 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు షాంసీ (784 పాయింట్లు), ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ జంపా (725 పాయింట్లు), ఇంగ్లండ్ ఆటగాడు రషీద్ (719 పాయింట్లు), అఫ్ఘానిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ (710 పాయింట్లు) టాప్-5లో స్థానం దక్కించుకున్నారు.

Belly Fat : బాన బొజ్జ ప్రమాదకరమా? పరిష్కారం ఏంటంటే..

టాప్-10లో ఒక్క టీమిండియా బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం. ఆల్‌రౌండర్ల జాబితాలో మహ్మద్ నబీ (అఫ్ఘానిస్తాన్), షకీబ్ (బంగ్లాదేశ్), లివింగ్ స్టోన్ (ఇంగ్లండ్), మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), హసరంగ (శ్రీలంక) టాప్-5లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ టాప్-10లో ఒక్క భారత ప్లేయర్ కూడా లేడు. కాగా, బ్యాటింగ్ విభాగంలో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. 24 స్థానాలు మెరుగుపరుచుకుని 59వ
స్థానంలో నిలిచాడు.