Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికలు.. యోగి ఆదిత్యానాథ్‌కు కేజ్రీవాల్ కౌంటర్

ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించిన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. యోగి ట్వీట్ రీట్వీట్ చేసిన కేజ్రీవాల్.. ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చారు.

Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికలు.. యోగి ఆదిత్యానాథ్‌కు కేజ్రీవాల్ కౌంటర్

Arvind Kejriwal: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేసిన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రవాదులపై సానుభూతి కలిగిన పార్టీ అని యోగి చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు.

Tamil Nadu: పాముకు పూజలు చేస్తుండగా నాలుకపై కాటేసిన పాము.. భక్తుడి నాలుక కోసేసిన పూజారి

గూండాయిజం, వేధింపులు, అవినీతి కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని.. అదే స్కూల్స్, రోడ్లు, విద్యుత్, నీళ్లు వంటివి కావాలంటే ఆమ్ ఆద్మీకి ఓటు వేయాలని కేజ్రీవాల్ అన్నారు. ట్విట్టర్ ద్వారా యోగి చేసిన ఆరోపణల ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. ఆప్‌పై ఆరోపణలు చేస్తూ యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ వచ్చింది. నిజానికి ఆ పార్టీ తీవ్రవాదులకు అనుకూలం’’ అని యోగి ట్వీట్ చేశారు. దీన్ని కేజ్రీవాల్ రీ ట్వీట్ చేస్తూ బదులిచ్చారు. ‘‘వేధింపులు, గూండాయిజం, అవినీతి, తప్పుడు రాజకీయాలు వంటివి కావాలంటే బీజేపీకి ఓటు వేయండి. అదే స్కూళ్లు, రోడ్లు, విద్యుత్, నీళ్లు, ఆస్పత్రులు వంటివి కావాలనుకుంటే ఆమ్ ఆద్మీకి ఓటు వేయండి’’ అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.

Pangeos: సముద్రంలో తేలియాడే మహా నగరం నిర్మిస్తున్న సౌదీ అరేబియా… 65 వేల కోట్లతో సిద్ధంకానున్న భారీ నౌక!

ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు గుజరాత్‌పై దృష్టి పెట్టింది. వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్కడ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. గుజరాత్‌లో బీజేపీ వరుసగా 27 ఏళ్ల నుంచి పాలిస్తోంది. అందులో 13 సంవత్సరాలు వరుసగా మోదీయే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇన్నేళ్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ గత ఎన్నికల్లో కొంచెం మెరుగైన ఫలితాలే సాధించింది.