No Confidence Motion: ఓడిపోతామని తెలిసీ కూడా మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఇండియా ప్లాన్ ఏంటంటే?

సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో ఉంది. 198వ నిబంధన ప్రకారం ఈ తీర్మానం లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు దాదాపు 50 మంది ఎంపీల మద్దతు అవసరం.

No Confidence Motion: ఓడిపోతామని తెలిసీ కూడా మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఇండియా ప్లాన్ ఏంటంటే?

NDA vs INDIA: మణిపూర్ హింసాకాండ కేసుకు సంబంధించి ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు కావస్తున్నా సభా కార్యకలాపాలు ప్రతిరోజు రచ్చలోనే కొనసాగుతున్నాయి. బుధవారం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. దీంతో పాటు తెలంగాణ అధికార పార్టీ బీఆర్‌ఎస్ కూడా ప్రత్యేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది.

No Confidence Motion: 2023లో తన మీద అవిశ్వాస తీర్మానం పెడతారని 2019లోనే చెప్పిన ప్రధాని మోదీ

పార్లమెంటులో సంఖ్యాబలం చూస్తుంటే మోడీ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంది. విపక్షాలు తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానం ఆ సంఖ్యాబలం ఏమాత్రం నిలువదు. అయినప్పటికీ విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మరి పార్లమెంటులో బలం లేకపోయినా విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు తీసుకువస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయం తెలియకుండా విపక్షాలు ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టవు. మరి దాని వెనుక విపక్షాలు వేసిన ఎత్తుగడ ఏంటి?

పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల బలాబలాలు
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ప్రస్తుతం లోక్‌సభలో 330 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇందులో ఒక్క బీజేపీకే 301 మంది ఎంపీలు ఉన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష శిబిరం అంటే ఇండియా కూటమికి లోక్‌సభలో 142 మంది మద్దతు ఉంది. ఇక రాజ్యసభలో అధికార కూటమికి 111 మంది ఎంపీల మద్దతు ఉండగా, విపక్షాలకు 96 మంది ఎంపీలు ఉన్నారు. ఏ సభలో చూసుకున్నా అధికార పార్టీ సంపూర్ణ బలంతో ఉంది.

మరి ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ఎందుకు తీసుకొచ్చింది?
సాధారణంగా సభలో అధికార, విపక్షాల మధ్య ఒక ఆధిపత్య వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తామే చర్చా కేంద్రంగా ఉండాలని ఇరు వర్గాలు కోరుకుంటాయి. ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రతిపక్షం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలు ఇంత పట్టుదల వల్ల ఈ అంశంపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. ఇక అవిశ్వాస తీర్మానంతో పార్లమెంటుకు ప్రధాని మోదీని ఆహ్వానించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అంశాన్ని అదునుగా తీసుకుని ప్రధాని మోదీని చుట్టుముట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి.

India: చైనా, పాక్ వెన్నులో వణుకు పుట్టించే ప్రాజెక్టును ప్రారంభిస్తున్న భారత్.. ఎన్ని కోట్లాది రూపాయల ఖర్చో తెలుసా?

ఇకపోతే, ప్రస్తుతం ఉన్న ఎన్డీయేకు ఏకైక ముఖం మాత్రమే ఉంది. అది ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అటువంటి పరిస్థితిలో ప్రధాని మోదీ ఏ విధంగానైనా ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడం బీజేపీకి అంత మంచిది కాదు. అందుకే సభ ప్రారంభం కాకముందే మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ మీడియా ముందు ఖండిస్తూ కఠిన చర్యల గురించి మాట్లాడారు. అయితే మోదీని పార్లమెంటులో మాట్లాడించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి.

అవిశ్వాస తీర్మానం ఎలా తెస్తారు?
సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో ఉంది. 198వ నిబంధన ప్రకారం ఈ తీర్మానం లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు దాదాపు 50 మంది ఎంపీల మద్దతు అవసరం. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా 51 శాతానికి పైగా ఎంపీలు అనుకూలంగా ఓటేస్తే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది.