Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.

Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

Covid 19

Covid-19: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.

Lawrence Bishnoi: సిద్ధూ హత్య.. లారెన్స్ బిష్ణోయే సూత్రధారి

ప్రస్తుతం దేశంలో 1.62 శాతం రోజువారీ పాజిటివిటీ రేటుతో, 32,498 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎప్పట్లాగే మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం మహారాష్ట్రలో 2,701 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలోనే 1,765 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో బీఏ5 వేరియెంట్ కూడా ఉంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసుల పెరుగుదల 40 శాతం ఉండగా, మంగళవారంతో పోలిస్తే బుధవారం కూడా మరో 40 శాత కరోనా కేసులు పెరిగాయి. బుధవారం కరోనా నుంచి 3,591 మంది కోలుకున్నారు. తమిళనాడులో 195, ఢిల్లీలో 564, ఒడిశాలో 15, మిజోరంలో 15 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Doctor dies: బిల్డింగ్‌పై నుంచి పడి డాక్టర్ మృతి

ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. పలు రాష్ట్రాలు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేశాయి. గడిచిన 24 గంటల్లో 15.4 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. వీరిలో నాలుగు లక్షల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు. 3 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తైంది.