Indian Navy: ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం రాఫెల్- ఎం, ఎఫ్-18లను పరీక్షిస్తున్న భారత నేవీ

భారత నావికాదళానికి సేవలు అందించనున్న ఐఎన్ఎస్ విక్రాంత్ వాహకనౌక పై.. సరిగ్గా ఇమిడిపోయే యుద్ధ విమానాలను(fighter jets) భారత నేవీ పరీక్షించనుంది.

Indian Navy: ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం రాఫెల్- ఎం, ఎఫ్-18లను పరీక్షిస్తున్న భారత నేవీ

Vikrant

Indian Navy: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడి, మరికొన్ని రోజుల్లో భారత నావికాదళానికి సేవలు అందించనున్న ఐఎన్ఎస్ విక్రాంత్ వాహకనౌక పై.. సరిగ్గా ఇమిడిపోయే యుద్ధ విమానాలను(fighter jets) భారత నేవీ పరీక్షించనుంది. ఈమేరకు జనవరి 6 నుంచి గోవాలోని ఐఎన్ఎస్ హంసా ఎయిర్ టెస్ట్ ఫెసిలిటీ కేంద్రం వద్ద రెండు అధునాతన యుద్ధ విమానాలను భారత నావికాదళ అధికారులు పరీక్షించనున్నారు. యుద్ధ రంగంలో సైన్యానికి త్వరితగతిన సహాయం అందే విధంగా.. యుద్ధ విమానాలను మోహరింపజేస్తారు. అందుకోసం ఆయా విమానాలను ఒకచోటి నుంచి మరొక చోటికి తరలించేందుకు, భౌగోళిక సదుపాయం ఉండని పక్షంలో సముద్ర మార్గం ద్వారా భారీ వాహకనౌకలను వినియోగించి యుద్ధ విమానాలను తరలిస్తారు. అటువంటి వాహకనౌకైన “ఐఎన్ఎస్ విక్రాంత్”.. కొచ్చి సముద్ర తీరంలో అభివృద్ధి దశలో ఉంది. 2022 ఆగష్టు 15న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా “ఐఎన్ఎస్ విక్రాంత్”ను భారత నేవీ అధికారులు ఆవిష్కరించనున్నారు.

Also read: Kia New Car: “కారెన్స్” కొత్త ఏడాదిలో కియా నుంచి కొత్త కారు

అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఎటువంటి యుద్ధ విమానాలు తరలించేందుకు అవకాశం ఉంది అనే విషయంపై ప్రస్తుతం పరీక్షలు జరపనున్నారు. రాఫెల్-ఎం అనే ఫైటర్ జెట్స్ ను ముందుగా పరీక్షించనున్నారు. జనవరి 6 నుంచి గోవాలోని ఐఎన్ఎస్ హంసా ఎయిర్ టెస్ట్ ఫెసిలిటీ కేంద్రంలో.. జరుపనున్న ఈ ప్రయోగాల్లో రాఫెల్-ఎం విమానాలపై కొన్ని కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడున్న 283 మీటర్ల మాక్-అప్ స్కీ జంప్ పై నుంచి రాఫెల్ విమానాలను ప్రయోగించి ఫలితాలను విశ్లేషిస్తారు. దాదాపు 12 రోజుల పాటు ఈప్రయోగాలు జరగనున్నాయి. ఇక “ఐఎన్ఎస్ విక్రాంత్” మోసుకెళ్లేందుకు ప్రయోగించనున్న మరో యుద్ధనౌక F-18 హార్నెట్ జెట్స్. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ F-18 హార్నెట్ జెట్స్ ఇప్పటికే అమెరికా నావికాదళంలో వివిధ సేవలు అందించాయి.

Also Read: Electric Bike Launch: విడుదలకు ముందే 36,000 బుకింగ్ లతో అదరగొట్టిన “ఈ-బైక్”

దీంతో ఈ విమానాలను సైతం “ఐఎన్ఎస్ విక్రాంత్” కోసం పరీక్షించనున్నారు. అయితే మార్చి రెండో వారంలో ఈ F-18 హార్నెట్ జెట్స్ పై ప్రయోగాలు జరపనున్నారు. కాగా, F-18 హార్నెట్ యుద్ధవిమానాలు “ఐఎన్ఎస్ విక్రాంత్”పై ఇమడక పోవచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. F-18 జెట్స్ ని విక్రాంత్ డెక్ పై ఎక్కించాలంటే..వాహకనౌక డెక్ పై సమూల మార్పులు చేయాల్సి ఉంటుందని ఇంజినీర్లు పేర్కొన్నారు. F-18 కంటే రాఫెల్-ఎం విమానాలు పరిమాణంలో చిన్నవిగానూ, మరింత ప్రభావవంతంగానూ ఉంటాయి. ప్రస్తుతం భారత నేవీలో వాహకనౌకగా సేవలు అందిస్తున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య, చాలా ఏళ్లుగా సర్వీస్ లో ఉంది. దీంతో ఈ వాహకనౌక పదే పదే మరమ్మతులకు గురౌతుంది

Also read: Nostradamus 2022 Predictions: 2022 గురించి నోస్ట్రాడమస్ ఏమ్మన్నాడంటే!