Electric Bike Launch: విడుదలకు ముందే 36,000 బుకింగ్ లతో అదరగొట్టిన “ఈ-బైక్”

"Boom Motors" ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది. "Boom Corbett"గా నామకరణం చేసిన ఈ ఈ-బైక్ మార్కెట్లోకి రాకముందే 36,000పైగా బుకింగ్ లతో అదరగొట్టింది.

Electric Bike Launch: విడుదలకు ముందే 36,000 బుకింగ్ లతో అదరగొట్టిన “ఈ-బైక్”

Corebtt

Electric Bike Launch: భారత్ లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరిగిపోతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, సర్వీస్ మైంటెనెన్సు వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ బైక్ లు స్కూటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తమిళనాడులోని కోయింబత్తుర్ కేంద్రంగా పనిచేస్తున్న “Boom Motors” ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది. “Boom Corbett”గా నామకరణం చేసిన ఈ ఈ-బైక్ మార్కెట్లోకి రాకముందే 36,000పైగా బుకింగ్ లతో అదరగొట్టింది. సింపుల్ డిజైన్, చూడగానే ఆకట్టుకుంటున్న కార్బెట్ బైక్ ఈ నెల నుంచే వినియోగదారులకు చేరనుంది.

Also Read: Nostradamus 2022 Predictions: 2022 గురించి నోస్ట్రాడమస్ ఏమ్మన్నాడంటే!

Corbett 14, 14-EX అనే రెండు వేరియంట్ లలో వస్తున్న ఈబైక్ లో 2.3 kWh సామర్ధ్యంగల బ్యాటరీని అమర్చారు. బ్యాటరీ మొత్తం 2.5 గం.ల నుంచి 4 గంటల వ్యవధిలో ఛార్జింగ్ అవుతుంది. ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ తో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. వీటిలో Corbett 14 బైక్.. 3 kW మోటార్ తో, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. ఇక 4 kW మోటార్ తో వస్తున్న Corbett 14-EX బైక్ గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. హై-టెన్సైల్ స్టీల్‌తో తయారు చేయబడిన చాసిస్ కలిగి ఉన్న ఈ బైక్ గరిష్టంగా 200 కిలోల బరువు మోయగలదని “Boom Motors” పేర్కొంది. అవసరమైతే బ్యాటరీని మరింత ఎక్కువ కెపాసిటీకి అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంది. ఇంట్లో ఉండే సాధారణ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా కూడా ఈ బైక్ ను ఈజీగా ఛార్జింగ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

Also Read: Kia New Car: “కారెన్స్” కొత్త ఏడాదిలో కియా నుంచి కొత్త కారు

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలూ పట్టణాల్లో ఉన్న 60 డీలర్ కేంద్రాల వద్ద లభించనున్న ఈ బైక్ ధరలు Corbett 14 Rs. 89,999 గానూ, 14-EX ధర 1,24,999గానూ ఉన్నాయి. వినియోగదారులు 5 సంవత్సరాల EMI సదుపాయంతో బైక్ ను సొంతం చేసుకోవచ్చని సంస్థ సీఈఓ నారాయణన్ పేర్కొన్నారు. ఇప్పటికే వచ్చిన ఆర్డర్లు, బుకింగ్ లతో సంస్థ ఆదాయం రూ.400 కోట్లు దాటినట్టు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది

Also read: Fiber : ఆరోగ్యానికి పీచు పదార్ధం…