IndiGo Flight: రన్‌వేపై జారిన ఇండిగో విమానం.. నిలిపివేసిన అధికారులు

సాంకేతిక లోపాలు, చిన్న ప్రమాదాలు వంటి కారణాలతో విమానాల నిలిపివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండిగో విమానం రన్‌వేపై జారిపోవడంతో ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు.

IndiGo Flight: రన్‌వేపై జారిన ఇండిగో విమానం.. నిలిపివేసిన అధికారులు

Indigo Flight

IndiGo Flight: విమానం టెకాఫ్ అవుతున్న సమయంలో రన్‌వేపై జారిపోవడంతో ఇండిగో విమానాన్ని నిలిపివేశారు అధికారులు. ఈ ఘటన గురువారం అసోంలోని జోర్హట్‌లో జరిగింది. 6ఈ757 అనే ఇండిగో విమానం గురువారం జోర్హట్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. అయితే, విమానం టేకాఫ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా, రన్‌వేపై జారిపోయింది.

Mass Hysteria: అరుపులు.. ఏడుపులు.. స్కూల్లో విచిత్రంగా ప్రవర్తించిన అమ్మాయిలు… అసలేమైంది?

పక్కన గడ్డి, బురద అనే ప్రదేశంలోకి చొచ్చుకెళ్లింది. టైర్లు బురదలో దిగిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్ని దించివేసిన తర్వాత విమానాన్ని అధికారులు తనిఖీ చేశారు. విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తేల్చారు. ఈ ఘటనతో విమానాన్ని అధికారులు నిలిపివేశారు. ఫ్లైట్ రద్దు చేశారు. ప్రస్తుతం ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఎయిర్‌పోర్టులోనే ఎదురు చూస్తున్నారు.

LED Screen Falls: లైవ్ షోలో ఎగిరిపడ్డ భారీ ఎల్ఈడీ స్క్రీన్.. డ్యాన్సర్లకు గాయాలు.. వీడియో వైరల్

విమానాన్ని పూర్తిగా పరీక్షించి అధికారులు అనుమతిస్తే విమానం బయలుదేరుతుంది. లేదంటే ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ చేయడమో లేదా ఇంకో ఫ్లైట్ అరెంజ్ చేయడమో చేస్తామని అధికారులు చెబుతున్నారు.