iPhone Users : ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక.. iMessage ద్వారా హ్యాకర్లు మాల్‌వేర్ పంపుతున్నారట.. తస్మాత్ జాగ్రత్త..!

iPhone Users : సైబర్ సెక్యూరిటీ (Kaspersky) కంపెనీ iOS డివైజ్‌లపై మాల్‌వేర్ రిస్క్ ఉందని గుర్తించింది. హ్యాకర్ల దాడిని 'Operation Triangulation' అని పిలుస్తారు. యూజర్ల నుంచి ఎలాంటి ప్రమేయం లేకుండానే iMessage ద్వారా మాల్‌వేర్ పంపుతారు.

iPhone Users : ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక.. iMessage ద్వారా హ్యాకర్లు మాల్‌వేర్ పంపుతున్నారట.. తస్మాత్ జాగ్రత్త..!

iPhone users at risk as hackers send malware via iMessage to gain access

iPhone Users : మీరు ఐఫోన్ యూజర్లా? అయితే, తస్మాత్ జాగ్రత్త.. మీ ఐఫోన్ డివైజ్‌లో క్లిక్ చేసే లింకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈసారి ఐఫోన్ యూజర్లపై మాల్‌వేర్ దాడికి సిద్ధమయ్యారు. సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం.. ఐఫోన్ డివైజ్ కంట్రోల్ చేయగల కొత్త రకమైన హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ ( (Kaspersky) iOS డివైజ్‌లపై జరుగుతున్న ఈ దాడిని కనుగొంది.

దీనిని ‘ఆపరేషన్ ట్రయాంగ్యులేషన్’ అని పిలుస్తారు. ఐఫోన్ యూజర్ల నుంచి నుంచి ఎలాంటి ప్రమేయం లేకుండా iMessage ద్వారా మాల్వేర్‌ను పంపుతారు. తద్వారా డివైజ్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఆ తర్వాత ఐఫోన్ పూర్తి కంట్రోల్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఐఫోన్ యూజర్లకు తెలియకుండా వారి కార్యకలాపాలను రహస్యంగా మానిటరింగ్ చేసేందుకు ఈ మాల్‌వేర్ హ్యాకర్లకు అనుమతిస్తుంది.

Read Also : Apple iPhone 14 Sale : అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు..!

హ్యాకర్ల చేతికి మీ ఐఫోన్ ఫుల్ కంట్రోల్.. :
సైబర్ కంపెనీ (Kaspersky)లోని నిపుణులు తమ సొంత Wi-Fi నెట్‌వర్క్‌ని మానిటరింగ్ చేయడం ద్వారా గుర్తించారు. తమ ఉద్యోగులలో చాలా మంది ఐఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు గమనించారు. మాల్‌వేర్ అటాక్ ఎలా పని చేస్తుందో వివరించారు. ఐఫోన్ యూజర్లు అటాచ్‌మెంట్‌తో (iMessage)ని అందుకుంటారు. ఆ మెసేజ్ ఓపెన్ చేయగానే డివైజ్‌లో మాల్‌వేర్ వచ్చి చేరుతుంది. ఆపై డివైజ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఐఫోన్‌లో మాల్‌వేర్ చేరిన తర్వాత పూర్తి కంట్రోల్ హ్యాకర్ల చేతిలోకి వెళ్తుంది.

iPhone users at risk as hackers send malware via iMessage to gain access

iPhone users at risk as hackers send malware via iMessage to gain access

ఆ తర్వాత పంపిన మెసేజ్ ఆటోమాటిక్‌గా డిలీట్ అవుతుంది. మాల్వేర్ సోకిన డివైజ్ నుంచి రిమోట్ సర్వర్‌లకు సైలంట్‌గా ప్రైవేట్ డేటాను పంపుతుంది. ఈ డివైజ్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ చేసిన ఆడియో, మెసేజింగ్ యాప్‌ల నుంచి ఫొటోలు, డివైజ్ లొకేషన్ వంటి అంశాలు ఇందులో ఉంటాయి. అయితే, మాల్‌వేర్ కంట్రోల్ ద్వారా డివైజ్‌ స్టోర్ చేసిన డేటాను మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఈ దాడిలో (Kaspersky)ని హ్యాకర్లు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు.

ఈ రకమైన దాడుల నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు వ్యాపారాలు తమ సిస్టమ్‌ల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి. ఉద్యోగులకు ఇలాంటి సైబర్ దాడులపై సమాచారాన్ని తెలియజేయాలి. ఈ దాడుల నుంచి రక్షించడానికి అవసరమైన టూల్స్ అందించడం చాలా ముఖ్యం. Kaspersky ఆపరేషన్ ట్రయాంగ్యులేషన్‌పై తన పరిశోధనను కొనసాగిస్తోంది. త్వరలో మరిన్ని వివరాలను షేర్ చేయాలని యోచిస్తోంది. థర్డ్-పార్టీ సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తే మాల్‌వేర్ దాడుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

Read Also : Nissan Magnite Discount Offer : రూ. 6 లక్షల విలువైన SUVపై రూ. 62 వేల తగ్గింపు.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి..!