IPL 2023, RCB vs KKR: బెంగ‌ళూరుపై కోల్‌క‌తా విజ‌యం

IPL 2023, RCB vs KKR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది.

IPL 2023, RCB vs KKR: బెంగ‌ళూరుపై కోల్‌క‌తా విజ‌యం

RCB vs KKR

Updated On : April 26, 2023 / 11:11 PM IST

IPL 2023, RCB vs KKR:ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 26 Apr 2023 11:12 PM (IST)

    కోల్‌క‌తా విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది. దీంతో కోల్‌క‌తా 21 ప‌రుగుల తేడాతో గెలిచింది. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(54; 37 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించిన‌ప్ప‌టికి మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మూడు వికెట్లు తీయ‌గా సుయాష్ శర్మ, ర‌స్సెల్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

  • 26 Apr 2023 11:00 PM (IST)

    కార్తిక్ ఔట్

    వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి దినేశ్ కార్తిక్‌(22) రింకూ సింగ్ చేతికి చిక్కాడు. దీంతో 154 ప‌రుగుల(17.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద బెంగ‌ళూరు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 156/8. డేవిడ్ విల్లీ(3), విన‌య్‌కుమార్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:58 PM (IST)

    హ‌స‌రంగ ఔట్‌

    బెంగ‌ళూరు మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌స్సెల్ బౌలింగ్‌లో అనుకుల్ రాయ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో హ‌స‌రంగ‌(5) ఔట్ అయ్యాడు. దీంతో 152 ప‌రుగుల వ‌ద్ద బెంగ‌ళూరు ఏడో వికెట్ కోల్పోయింది.17 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 153/7. డేవిడ్ విల్లీ(1), దినేశ్ కార్తిక్‌(22 క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:48 PM (IST)

    7 ప‌రుగులు

    16వ ఓవ‌ర్‌ను సునీల్ న‌రైన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 145/6. హ‌స‌రంగ‌(5), దినేశ్ కార్తిక్‌(15) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:44 PM (IST)

    సుయాష్ ప్రభుదేసాయి ర‌నౌట్‌

    సుయాష్ ప్రభుదేసాయి ర‌నౌట్ అయ్యాడు. సుయాష్ శర్మ బౌలింగ్‌లో దినేశ్ కార్తిక్ షాట్ ఆడాడు. మొద‌టి ప‌రుగు పూర్తి చేశాడు. కార్తిక్ త‌ప్పిదం కార‌ణంగా రెండో ప‌రుగు తీసే క్ర‌మంలో సుయాష్ ప్రభుదేసాయి ర‌నౌట్ అయ్యాడు. దీంతో 138 ప‌రుగుల(14.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద బెంగ‌ళూరు ఆరో వికెట్ కోల్పోయింది. 15 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 138/6. హ‌స‌రంగ‌(0), దినేశ్ కార్తిక్‌(13) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:39 PM (IST)

    దినేశ్ కార్తిక్ ఫోర్‌

    సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో దినేశ్ కార్తిక్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 132/5. సుయాష్ ప్రభుదేసాయి(8), దినేశ్ కార్తిక్‌(9) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:30 PM (IST)

    విరాట్ కోహ్లి ఔట్‌

    బెంగ‌ళూరు జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌స్సెల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ(54) భారీ షాట్‌కు య‌త్నించగా బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న వెంక‌టేశ్ అయ్య‌ర్ చ‌క్క‌టి క్యాచ్ అందుకోవ‌డంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 115 ప‌రుగుల(12.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద బెంగ‌ళూరు ఐదో వికెట్ కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 121/5. సుయాష్ ప్రభుదేసాయి(6), దినేశ్ కార్తిక్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:25 PM (IST)

    మహిపాల్ లోమ్రోర్ ఔట్‌

    బెంగ‌ళూరు జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన లోమ్రోరు ఆ మ‌రుస‌టి బంతికి సైతం భారీ షాట్‌కు య‌త్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న రస్సెల్ చేతికి చిక్కాడు. దీంతో 113 ప‌రుగుల(11.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద బెంగ‌ళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. 12 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 115/4. కోహ్లి(54), దినేశ్ కార్తిక్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:20 PM (IST)

    కోహ్లి అర్ధ‌శ‌త‌కం

    సుయాష్ శర్మ బౌలింగ్‌లో రెండు ప‌రుగులు తీసిన విరాట్ కోహ్లి 33 బంతుల్లో 6 ఫోర్ల‌తో అర్ధ‌శత‌కాన్ని పూర్తి చేశాడు. 11 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 106/3. కోహ్లి(52), మహిపాల్ లోమ్రోర్(28) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:17 PM (IST)

    మహిపాల్ లోమ్రోర్ రెండు సిక్స్‌లు

    ప‌దో ఓవ‌ర్‌ను సునీల్ న‌రైన్ వేశాడు. మహిపాల్ లోమ్రోర్ రెండు సిక్సులు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 96/3. కోహ్లి(44), మహిపాల్ లోమ్రోర్(27) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:07 PM (IST)

    8 పరుగులు

    సునీల్ న‌రైన్ ఎనిమిదో ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 72/3. కోహ్లి(40), మహిపాల్ లోమ్రోర్(7) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 10:03 PM (IST)

    6 ప‌రుగులు

    ఏడో ఓవ‌ర్‌ను ర‌స్సెల్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 64/3. కోహ్లి(38), మహిపాల్ లోమ్రోర్(1) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 09:58 PM (IST)

    మ్యాక్స్ వెల్ ఔట్‌

    బెంగ‌ళూరు జ‌ట్టు మ‌రో వికెట్‌ను కోల్పోయింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ భారీ షాట్‌కు య‌త్నించి డేవిడ్ వైస్ చేతికి చిక్కాడు. 6 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 58/3. కోహ్లి(33), మహిపాల్ లోమ్రోర్(0) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 09:51 PM (IST)

    షాబాజ్ అహ్మద్ ఎల్బీ

    బెంగ‌ళూరు జ‌ట్టు మ‌రో వికెట్‌ను కోల్పోయింది. సుయాష్ శర్మ బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్(2) ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో 51 ప‌ర‌గుల(4.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద బెంగ‌ళూరు రెండో వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 53/2. కోహ్లి(32), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 09:48 PM (IST)

    9 ప‌రుగులు

    నాలుగో ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేశాడు. విరాట్ కోహ్లి ఓ ఫోర్ కొట్ట‌గా మొత్తం 9 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 42/1. కోహ్లి(22), షాబాజ్ అహ్మద్(2) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 09:41 PM (IST)

    డుప్లెసిస్ ఔట్‌

    బెంగ‌ళూరు జ‌ట్టుకు షాక్ త‌గిలింది. ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్(17) ఔట్ అయ్యాడు. సుయాష్ శర్మ బౌలింగ్‌లో రింకూ సింగ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో బెంగ‌ళూరు 31 ప‌రుగుల(2.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 33/1. కోహ్లి(14), షాబాజ్ అహ్మద్(1) క్రీజులో ఉన్నారు

  • 26 Apr 2023 09:38 PM (IST)

    రెండు సిక్స్‌లు, ఫోర్‌

    ఉమేశ్ యాద‌వ్ రెండో ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లో తొలి బంతికి కోహ్లి ఫోర్ కొట్ట‌గా, ఆఖ‌రి రెండు బంతుల‌ను డుప్లెసిస్ సిక్స్‌లుగా మ‌లిచాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 19 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 30/0. కోహ్లి(12), డుపెసిస్‌(17) క్రీజులో ఉన్నారు

  • 26 Apr 2023 09:33 PM (IST)

    చెరో ఫోర్‌

    భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బెంగ‌ళూరు జ‌ట్టు బ‌రిలోకి దిగింది. ఫాఫ్ డుప్లెసిస్‌, విరాట్ కోహ్లిలు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను వైభవ్ అరోరా వేశాడు. కోహ్లి, డుప్లెసిస్ చెరో ఫోర్ కొట్టారు. మొద‌టి ఓవ‌ర్‌కు బెంగ‌ళూరు స్కోరు 11/0. కోహ్లి(6), డుపెసిస్‌(4) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 09:15 PM (IST)

    బెంగ‌ళూరు ల‌క్ష్యం 201

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో జేస‌న్ రాయ్‌(56; 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో అల‌రించ‌గా నితీశ్ రాణా(48; 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించాడు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌స‌రంగ, వినయ్‌కుమార్ రెండు వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

  • 26 Apr 2023 09:10 PM (IST)

    15 ప‌రుగులు, ఓ వికెట్

    మ‌హ్మ‌ద్ సిరాజ్ వేసిన 19వ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ తొలి మూడు బంతుల‌ను 6,4,4 గా మ‌లిచాడు. అయితే.. ఆఖ‌రి బంతికి ర‌స్సెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌క‌తా 185 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 19 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 185/5. డేవిడ్ వైస్(0) రింకూ సింగ్‌(17)క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 09:03 PM (IST)

    కీల‌క స‌మ‌యంలో వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట్‌

    ఒకే ఓవ‌ర్‌లో నితీశ్ రాణా, వెంక‌టేశ్ అయ్య‌ర్‌లు ఔటైయ్యారు. హ‌స‌రంగా బౌలింగ్‌లో రెండో బంతికి భారీ షాట్‌కు య‌త్నించిన నితీశ్ రాణా(48) విన‌య్‌కుమార్ చేతికి చిక్క‌గా నాలుగో బంతికి వెంక‌టేశ్ అయ్య‌ర్‌(31) మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. 18 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 170/4. ఆండ్రూ ర‌స్సెల్‌(1), రింకూ సింగ్‌(1)క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:59 PM (IST)

    నితీశ్ రాణా ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. హ‌స‌రంగా బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన నితీశ్ రాణా(48) విన‌య్‌కుమార్ చేతికి చిక్కాడు. దీంతో కోల్‌క‌తా 168 ప‌రుగుల(17.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

  • 26 Apr 2023 08:58 PM (IST)

    17 ప‌రుగులు

    నితీశ్ రాణా దూకుడు పెంచాడు. విన‌య్‌కుమార్ 17వ ఓవ‌ర్‌ను వేయ‌గా ఆఖ‌రి మూడు బంతుల‌కు నితీశ్ రాణా వ‌రుస‌గా 4,4,6 బాదాడు. ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 167/2. నితీశ్ రాణా(48), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(30) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:50 PM (IST)

    రెండు సిక్సులు, ఫోర్‌

    16వ ఓవ‌ర్‌ను హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేశాడు. మూడో బంతికి వెంక‌టేశ్ అయ్య‌ర్ ఫోర్ కొట్ట‌గా ఆఖ‌రి రెండు బంతుల‌ను నితీశ్ రాణా సిక్సులుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 19 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 150/2. నితీశ్ రాణా(33), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(28) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:46 PM (IST)

    5 ప‌రుగులు

    మ‌హ్మ‌ద్ సిరాజ్ వేసిన ప‌దిహేనో ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 131/2. నితీశ్ రాణా(20), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(23) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:42 PM (IST)

    9 ప‌రుగులు

    డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో నితీశ్ రాణా ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 126/2. నితీశ్ రాణా(18), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(20) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:35 PM (IST)

    బ‌తికిపోయిన నితీశ్ రాణా.. సిరాజ్ క్యాచ్ మిస్‌

    విజయ్‌కుమార్ బౌలింగ్‌లో నితీశ్ రాణా భారీ షాట్‌కు య‌త్నించ‌గా లాంగాన్‌లో పీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వ‌ద్ద‌కు బంతికి వెళ్లింది. చాలా సునాయాస‌న‌మైన క్యాచ్‌ను సిరాజ్ జార విడిచాడు. దీంతో రాణా కు లైఫ్ వ‌చ్చింది. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టాడు. 13 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 117/2. నితీశ్ రాణా(12), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(17) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:30 PM (IST)

    అయ్య‌ర్ రెండు ఫోర్లు

    హ‌సరంగా ఓవ‌ర్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 106/2. నితీశ్ రాణా(4), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(15) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:22 PM (IST)

    రాయ్ ఔట్‌

    కోల్‌క‌తా ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. విజయ్‌కుమార్ బౌలింగ్‌లో రెండో బంతికి డేవిడ్ విల్లీకి క్యాచ్ ఇచ్చి జ‌గ‌దీశ‌న్ ఔట్ కాగా ఆఖ‌రి బంతికి జేస‌న్ రాయ్(56) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 88/2. నితీశ్ రాణా(0), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(2) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:19 PM (IST)

    జ‌గ‌దీశ‌న్ ఔట్‌

    ధాటిగా ఆడే క్ర‌మంలో ఎన్ జ‌గ‌దీశ‌న్ ఔట్ అయ్యాడు.విజయ్‌కుమార్ బౌలింగ్‌లో డేవిడ్ విల్లీ చేతికి చిక్కాడు. దీంతో కోల్‌క‌తా 83 ప‌రుగుల(9.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 26 Apr 2023 08:14 PM (IST)

    జ‌గ‌దీశ‌న్ ఫోర్‌

    తొమ్మిదో ఓవ‌ర్‌ను హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని మూడో బంతికి జ‌గ‌దీశ‌న్ ఫోర్ కొట్టాడంతో మొత్తంగా 7 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 82/0. జేసన్ రాయ్(54), ఎన్.జగదీశ‌న్(27) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:09 PM (IST)

    జేస‌న్ రాయ్ అర్ధ‌శ‌త‌కం

    విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు జేస‌న్ రాయ్‌. ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 75/0. జేసన్ రాయ్(52), ఎన్.జగదీశ‌న్(22) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:05 PM (IST)

    2 ప‌రుగులు

    ఏడో ఓవ‌ర్‌ను హ‌స‌రంగా వేశాడు. ఈ ఓవ‌ర్‌లో రెండు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 68/0. జేసన్ రాయ్(49), ఎన్.జగదీశ‌న్(18) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 08:00 PM (IST)

    నాలుగు సిక్స‌ర్లు కొట్టిన రాయ్‌

    కోల్‌క‌తా ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను షాబాజ్ అహ్మద్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో రెండు, మూడు, నాలుగు బంతుల‌కు వ‌రుస‌గా హ్యాట్రిక్ సిక్స్‌ల‌ను రాయ్ కొట్టాడు. ఆఖ‌రి బంతిని సైతం రాయ్ సిక్స్ గా మ‌ల‌డంతో ఈ ఓవ‌ర్‌లో 25 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 66/0. జేసన్ రాయ్(48), ఎన్.జగదీశ‌న్(17) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 07:55 PM (IST)

    6 ప‌రుగులు

    ఐదో ఓవ‌ర్‌ను హ‌స‌రంగా వేశ‌డు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి రాయ్ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 6 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 41/0. జేసన్ రాయ్(24), ఎన్.జగదీశ‌న్(16) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 07:50 PM (IST)

    17 ప‌రుగులు

    జేస‌న్ రాయ్, జ‌గ‌దీశ‌న్‌లు క్ర‌మంగా దూకుడు పెంచుతున్నారు. నాలుగో ఓవ‌ర్‌ను డేవిడ్ విల్లీ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో జ‌గ‌దీశ‌న్ రెండు ఫోర్లు కొట్ట‌గా రాయ్ ఓ సిక్స్ బాదాడంతో మొత్తంగా 17 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 35/0. జేసన్ రాయ్(19), ఎన్.జగదీశ‌న్(15) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 07:45 PM (IST)

    క్ర‌మంగా దూకుడు పెంచుతున్న రాయ్‌

    జేస‌న్ రాయ్ క్ర‌మంగా దూకుడు పెంచుతున్నాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్ వేసిన మూడో ఓవ‌ర్‌లోని ఐదో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 5 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 18/0. జేసన్ రాయ్(12), ఎన్.జగదీశ‌న్(6) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 07:42 PM (IST)

    5 ప‌రుగులు

    రెండో ఓవ‌ర్‌ను డేవిడ్ విల్లీ  వేశాడు. రెండో బంతికి జగదీశ‌న్ ఫోర్ కొట్ట‌గా మొత్తంగా 5 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 13/0. జేసన్ రాయ్(8), ఎన్.జగదీశ‌న్(5) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 07:36 PM (IST)

    రెండు ఫోర్లు కొట్టిన రాయ్‌

    టాస్ ఓడిన కోల్‌క‌తా బ్యాటింగ్‌కు దిగింది. జేసన్ రాయ్, ఎన్.జగదీశ‌న్ ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. మొద‌టి ఓవ‌ర్‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ వేశాడు. మూడో బంతిని, ఐదో బంతిని రాయ్ బౌండ‌రీలుగా మ‌లిచాడు. మొద‌టి ఓవ‌ర్‌కు కోల్‌క‌తా స్కోరు 8/0. జేసన్ రాయ్(8), ఎన్.జగదీశ‌న్(0) క్రీజులో ఉన్నారు.

  • 26 Apr 2023 07:08 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు

    జేసన్ రాయ్, ఎన్.జగదీశ‌న్,  వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

  • 26 Apr 2023 07:06 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజ‌ట్టు

    విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

  • 26 Apr 2023 07:04 PM (IST)

    టాస్ గెలిచిన బెంగ‌ళూరు

    టాస్ గెలిచిన బెంగ‌ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌క‌తా తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.