IPL2022 Chennai Vs MI : చెలరేగిన ముంబై బౌలర్లు.. 97 పరుగులకే చెన్నై ఆలౌట్

ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై దారుణంగా ఆడింది. ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.(IPL2022 Chennai Vs MI)

IPL2022 Chennai Vs MI : చెలరేగిన ముంబై బౌలర్లు.. 97 పరుగులకే చెన్నై ఆలౌట్

Ipl2022 Csk Vs Mi

IPL2022 Chennai Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా చెన్నై జట్టు 16 ఓవర్లలోనే 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై దారుణంగా ఆడింది. ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (33 బంతుల్లో 36 పరుగులు-నాటైట్) మినహా ఎవరూ రాణించలేదు.(IPL2022 Chennai Vs MI)

MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం -ఎంఎస్ ధోనీ

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 97 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబైకి 98 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ముంబై బౌలర్ల ధాటికి ముగ్గురు చెన్నై బ్యాటర్లు (డేవన్ కాన్వే, మొయిన్‌ అలీ, తీక్షణ) డకౌట్‌గా వెనుదిరిగారు. రుతురాజ్ గైక్వాడ్ 7, రాబిన్ ఉతప్ప 1, అంబటి రాయుడు 10, శివమ్‌ దూబే 10, డ్వేన్ బ్రావో 12, ముకేశ్‌ చౌదరి 4 పరుగులు చేశారు. ధోనీ తర్వాత అత్యధిక స్కోరు అదనపు పరుగులే (15) కావడం విశేషం. మ్యాచ్‌ ప్రారంభంలో కరెంట్ కట్ తో డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడం కూడా చెన్నైని దెబ్బకొట్టింది. ముంబై బౌలర్లలో డానియల్ సామ్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. కుమార్ కార్తికేయ, మెరిడిత్ తలో రెండు వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, రమన్ దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.

IPL2022 CSK Vs MI Mumbai Indians Target 98

IPL2022 CSK Vs MI Mumbai Indians Target 98

ఐపీఎల్ చాంపియన్ గా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్ లో మాత్రలో దారుణమైన ప్రదర్శన కనబర్చింది. వరుస ఓటములు మూటకట్టుంది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌ అవకాశాలను ఏమూలనో సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మ్యాచుల్లో చెన్నై తప్పనిసరిగా గెలవాలి. ఒక్కటి ఓడినా ఇంటిబాట పట్టడం ఖాయం.

IPL 2022: “నా అరంగేట్ర మ్యాచ్ చూడటానికి బెటాలియన్ అంతా ప్లాన్ చేసింది”

చెన్నైతో పోరులో టాస్‌ నెగ్గిన రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు ఎప్పుడో దూరమైంది. మరోవైపు ఆరంభంలో డీలా పడిన చెన్నై తర్వాత పుంజుకుని నాలుగు విజయాలను నమోదు చేసింది. ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వచ్చిన తర్వాత మూడింట్లో రెండు విజయాలను సాధించడం చెన్నైకి సానుకూలాంశం.

ముంబై కూడా గుజరాత్‌, రాజస్తాన్‌ వంటి పటిష్ఠమైన జట్లపై గెలిచింది. అందుకే ముంబైతో మ్యాచ్‌ అంటే చెన్నై కాస్త జాగ్రత్త పడాల్సిందే. అయితే గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ముంబై ఘోర పరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో చెన్నై అవకాశాలకు ముంబై అడ్డుగా నిలుస్తుందా..? లేకపోతే ధోనీ సేన విజయం సాధించి ఆశలను సజీవంగా ఉంచుకుంటుందో లేదో చూడాలి.

ప్రస్తుత సీజన్‌లో చెన్నై 11 మ్యాచులకుగాను నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక ముంబై కేవలం రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి పదో స్థానంలో కొనసాగుతోంది. ఘోరంగా విఫలమైన కీరన్‌ పొలార్డ్‌ స్థానంలో ముంబై తరఫున ట్రిస్టన్‌ స్టబ్స్ ఎంట్రీ ఇచ్చాడు.

జట్ల వివరాలు:

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్‌ గైక్వాడ్, డేవన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్‌ దూబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డ్వేన్ బ్రావో, మహీశ్ తీక్షణ, సిమర్‌జిత్ సింగ్, ముకేశ్ చౌదరి.

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, టిమ్ డేవిడ్, డానియల్ సామ్స్, కుమార్‌ కార్తికేయ, హృతిక్ షోకీన్, బుమ్రా, రిలే మెరెడిత్‌.