IPL2022 Lucknow Vs RR : లక్నోకి రాజస్తాన్ షాక్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో లక్నోని చిత్తు చేసింది. 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.(IPL2022 Lucknow Vs RR)

IPL2022 Lucknow Vs RR : లక్నోకి రాజస్తాన్ షాక్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం

Ipl2022 Rajasthan Vs Lsg (1)

IPL2022 Lucknow Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో లక్నోని చిత్తు చేసింది. 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసింది.

లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. హుడా 39 బంతుల్లో 59 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్య(25), మార్కస్ స్టోయినస్(27) పరుగులు చేశారు. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, మెక్ కాయ్ తలో రెండు వికెట్లు తీశారు. యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశాడు.(IPL2022 Lucknow Vs RR)

ప్లేఆఫ్స్‌కు ముందు లక్నోకి ఇది షాక్ అనే చెప్పాలి. ఈ విజయంతో రాజస్తాన్‌ (16, +0.304) పాయింట్ల టేబుల్ లో రెండో స్థానానికి చేరుకుంది. రన్‌రేట్‌ తగ్గడంతో లక్నో (16, +0.262) మూడో స్థానానికి పడిపోయింది. ఇక మిగిలిన మ్యాచుల్లో అద్భుతాలు జరిగితే తప్పితే ఈ రెండు టీమ్‌లు దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే.

Hardik Pandya: ప్రపంచమంతా క్రికెట్ చూస్తోంది.. కెప్టెన్ సెన్సిబుల్‌గా ఉండటం చాలా ముఖ్యం – షమీ

టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్… ఓ మోస్త‌రు స్కోరే చేసింది. ఆదిలోనే స్టార్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత య‌శ‌స్వీ జైస్వాల్ (41) స‌త్తా చాటాడు. బ‌ట్ల‌ర్ అవుట్‌తో అత‌డికి జ‌త కూడిన కెప్టెన్ సంజూ శాంస‌న్ (32) దూకుడుగానే క‌నిపించినా స్వ‌ల్ప స్కోరుకే పెవిలియ‌న్ చేరాడు. త‌ర్వాత జైస్వాల్‌కు జ‌త క‌లిసిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (39) రాణించాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా వికెట్లు ప‌డ‌టంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రాజ‌స్తాన్ జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేసింది.

IPL2022 Kolkata Vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ విఫలం.. వరుసగా 5వ ఓటమి

ఇక ల‌క్నో బౌలింగ్ విష‌యానికి వ‌స్తే… వ‌రుస‌గా వికెట్లు తీసినా.. ల‌క్నో బౌల‌ర్లు ప‌రుగులు మాత్రం భారీగానే స‌మ‌ర్పించుకున్నారు. ల‌క్నో బౌల‌ర్ మార్క‌స్ స్టోయినిస్ ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే వేసి ఏకంగా 15 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ర‌వి బిష్ణోయ్‌కు రెండు వికెట్లు ద‌క్క‌గా… అవేశ్ ఖాన్‌, జాస‌న్ హోల్డ‌ర్‌, ఆయుష్ బ‌దోనీకి త‌లో వికెట్ ద‌క్కింది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : క్వింటన్ డికాక్‌, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్‌ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జాసన్ హోల్డర్‌, మోహ్‌సిన్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్, దుష్మంత చమీర, అవేశ్‌ ఖాన్‌.

రాజస్తాన్‌ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, జేమ్స్‌ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిధ్‌ కృష్ణ, చాహల్, మెక్‌కాయ్‌.