Iron Steel Cement Prices : కేంద్రం మరో గుడ్‌న్యూస్.. తగ్గనున్న స్టీల్, సిమెంట్ ధరలు

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్య ప్రజలకు కేంద్రం వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది.(Iron Steel Cement Prices)

Iron Steel Cement Prices : కేంద్రం మరో గుడ్‌న్యూస్.. తగ్గనున్న స్టీల్, సిమెంట్ ధరలు

Iron Steel Cement Prices

Iron Steel Cement Prices : పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్య ప్రజలకు కేంద్రం వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది. ఇప్పటికే పెట్రో, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్లాస్టిక్, సిమెంట్, ముడి పదార్ధాలపైనా సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక ఉక్కు ముడిపదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించనుంది. అదే సమయంలో స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించనున్నట్లు వెల్లడించారు. ఫలితంగా దేశంలో సిమెంట్, స్టీల్ కొరత తగ్గి ధరలు తగ్గుతాయని వివరించారు. తద్వారా గృహ నిర్మాణ వ్యయం భారీగా తగ్గుతుందని ఆమె చెప్పారు.

భారీగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు..
కాగా.. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం భారీగా తగ్గించింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తద్వారా లీటర్ పెట్రోల్ పై రూ.9.50, లీటర్ డీజీల్ పై రూ.7 మేర తగ్గనుందని వివరించారు. తగ్గించిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి.(Iron Steel Cement Prices)

LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!

దేశంలో గత కొన్నాళ్లుగా పెట్రో ధరలు పైపైకి దూసుకెళ్లడం తెలిసిందే. పెట్రోల్ లీటర్ రూ.120 వరకు ఉండగా, డీజిల్ లీటర్ రూ.105 వరకు పలుకుతోంది. ఇటీవల మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో పెట్రో ధరలను 14 సార్లు పెంచారు. తద్వారా లీటర్ పై గరిష్ఠంగా రూ.10 వరకు పెరిగింది. తాజాగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట కలగనుంది.

గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింపు..
మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలను కూడా కేంద్రం తగ్గించింది. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.200 సబ్సిడీ అందించనుంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని కండీషన్ పెట్టింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే రూ.200 సబ్సిడీ వర్తించనుంది. దీంతో సిలిండర్ చొప్పున రూ.200 తగ్గనుంది. ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ వర్తిస్తుంది. దీంతో 9 కోట్ల మంది వినియోగదారులకు లబ్ది చేకూరనుంది.

మాకు ప్రజలే మొదటి ప్రాధాన్యత-మోదీ
కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ పౌరులకు మరింత ఉపశమనం కలగడంతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వాన్ని ఎలప్పుడూ ప్రజలే మొదటి ప్రాధాన్యత అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.(Iron Steel Cement Prices)

Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

ధరలు తగ్గించడానికి గల కారణాలు..
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనాకాలం పూర్తవుతుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అలాగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉండడంతో పాటు యుక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తక్కువ ధరకు భారత్‌కు ముడి చమురును రష్యా అందిస్తోంది. ఇంధన ధరలను కేంద్రం తగ్గించడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.