Amith Shah : మోదీ నియంతనా? విమర్శకులకు అమిత్ షా సమాధానం ఇదే

 ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

Amith Shah : మోదీ నియంతనా? విమర్శకులకు అమిత్ షా సమాధానం ఇదే

Amith (1)

Amith Shah   ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్ర‌జా సేవ‌లో మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న పాల‌న తీరును షా మెచ్చుకున్నారు.  ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సన్ సద్ టీవీ ఛానల్ కి ఆదివారం ఇచ్చిన ఇంటర్వూలో అమిత్ షా మాట్లాడుతూ..త‌న‌కు తెలిసిన‌ గొప్ప ప్ర‌జాస్వామ్య నేత‌ల్లో ప్రధాని నరేంద్రమోదీ ఒక‌ర‌ని అన్నారు. మోదీ ఓ నియంత అన్న విపక్షాల విమర్శలను అమిత్ షా ఖండించారు. ఆయనలా వినే వ్యక్తిని తానెన్నడూ చూడలేదని చెప్పారు.

ఏదైనా సమస్య విషయమై మీటింగ్ జరిగినప్పుడు ప్రధాని మోదీ చాలా తక్కువ మాట్లాడుతారని, అందరూ చెప్పే దానిని ఓపిగ్గా వింటారని..తరువాత నిర్ణయం తీసుకుంటాడని షా అన్నారు. “ఇంత ఆలోచించడానికి ఏమి ఉంది?”అని అందరం తరచుగా ఆలోచిస్తుంటాం..కానీ మోదీ మాత్రం 2-3 సమావేశాల తర్వాత అందులోని మంచి చెడులను విశ్లేషించి ఓపికగా తుది నిర్ణయం తీసుకుంటాడని షా తెలిపారు.

ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సలహాను..ఆ సలహా యొక్క క్వాలిటీ ఆధారంగా మోదీ ప్రాధాన్యం ఇస్తారని..అంతేకానీ ఆ సలహా ఏ వ్యక్తి ఇస్తున్నారన్నదానికి ప్రాధాన్యతను ఇవ్వరని అన్నారు. అందుకే ఆయ‌నో నియంత అన్న విమ‌ర్శ‌ల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఆయ‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేబినెట్‌ను మోదీ చాలా ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో న‌డిపిస్తారు. మోదీయే అన్ని నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న భావ‌న స‌రికాదు. ప్ర‌తి అంశాన్ని ఆయ‌న చ‌ర్చిస్తారు. అంద‌రు చెప్పింది వింటారు. మంచి చెడుల‌ను బేరీజు వేసి ప్ర‌ధాన‌మంత్రి కాబ‌ట్టి ఎలాగూ తుది నిర్ణ‌యం మాత్రం ఆయ‌న‌దే అని అమిత్ షా చెప్పారు.

మోదీతో ఇటు ప్రతిపక్షం, అటు అధికార పక్షంలో కలిసి పనిచేసే అవకాశం తనకు దొరికినందుకు ఆనందంగా ఉందని అమిత్ షా అన్నారు. మోదీ పాలన చాలా గొప్పగా ఉందని ప్రశంసించారు. ప్రధాని ప్రభుత్వాన్ని అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.

ALSO READ  సొంత ఖర్చులతో టీకా వేయించుకున్నా.. మోదీ ఫోటో తొలగించండి.. కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి