QUTUB MINAR : కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..?

కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..? ఈరచ్చలేంటీ?

QUTUB MINAR : కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..?

Qutub Minar

QUTUB MINAR : ఓవైపు మసీదులు – మందిరాల మధ్య వివాదాలు తీవ్ర స్థాయిలో నడుస్తున్నాయి. మరోవైపు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌ మహల్ కూడా ఒకప్పటి హిందూ దేవాలయమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆ వివాదంలోకి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కుతుబ్ మినార్ కూడా చేరింది. ఒకప్పుడు దీని స్థానంలో హిందూ దేవాలయం ఉండేదన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా మరో వాదన తెరపైకి వచ్చింది. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏంటా వాదన ? కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది ? కుతుబ్ మినార్ కాదు.. అది సూర్య గోపురం! అంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. సూర్యుడి గమనం తెలుసుకునేందుకే దీన్ని నిర్మించారని..కుతుబ్‌ మినార్‌ని నిర్మించింది ఢిల్లీ సుల్తాన్ కాదని..వాదిస్తున్నారు కొంతమంది. రాజా విక్రమాదిత్య చేతుల మీదుగా స్థూపం నిర్మాణం జరిగిందని మరికొందరు అంటున్నారు.ఇలా ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై తెరపైకి కొత్త వాదన తెరపైకి వచ్చింది.

దేశంలోని చారిత్రక కట్టడాల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. రెండు మతాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. శతాబ్దాల కాలంగా దేశంలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి కొత్త విషయాలు, సరికొత్త వాదనలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఈ పంచాయితీలు అటు తిరిగి ఇటు తిరిగి కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. ఆ మధ్య తాజ్‌మహల్‌ తేజో మహల్‌ అంటూ వాదనలు తెరపైకి రావడం.. అందులో గదులు తెరవాలన్న డిమాండ్‌లు కోర్టు కేసులతో నానా రచ్చా నడిచింది.అటు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు హిందూ దేవాలయమన్న దానిపై అంతకు మించిన రచ్చ నడుస్తోంది.ఈ వేడి చల్లారక ముందే హాట్‌ హాట్‌గా మరో హాట్‌ టాపిక్‌ తెరపైకొచ్చింది. యునెస్కోతో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కుతుబ్‌ మినార్‌ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. కుతుబ్‌ మినార్‌ చుట్టూ పంచాయితీ మొదలైంది. దీంతో ఒక్కసారిగా అందరిచూపు ఈ చారిత్రక కట్టడంపైనే పడింది. నిజానికి ఈ కుతుబ్‌ మినార్‌ స్థానంలో ఒకప్పుడు హిందూ దేవాలయం ఉండేదన్న వాదన ఈనాటిది కాదు. దీనిపై ఎప్పటి నుంచో రచ్చ నడుస్తునే ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా సరికొత్తగా ఓ వాదన మొదలైంది.

Also read : Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి

కుతుబ్‌మినార్‌ను ఢిల్లీ సుల్తాన్‌..కుతుబ్ అల్-దిన్ ఐబక్ నిర్మించారన్నది చరిత్ర పుస్తకాల్లో ఉన్న పాఠం. కానీ.. 5వ శతాబ్దానికి చెందిన రాజా విక్రమాదిత్య ఈ స్థూపాన్ని నిర్మించారంటూ సంచలన ప్రకటన చేశారు పురావస్తుశాఖ మాజీ అధికారి ధర్మవీర్ శర్మ. అంతేకాదు మరో షాకింగ్‌ విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఇది కుతుబ్‌ మినార్‌ కాదని ఒక సూర్యగోపురమని.. సూర్యుడి దిశను అధ్యయనం చేయడం కోసం దీన్ని నిర్మించారన్నది ఆయన వాదన. ఆ కాలంలో ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్థూపంగా చరిత్రకారులు పేర్కొన్నట్టు ధర్మవీర్ చెప్పుకొచ్చారు. ఆర్కియాలజీ తరుపున కుతుబ్‌ మినార్‌లో పలుమార్లు సర్వే చేసిన అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. అలాగే తన వద్ద బలమైన అధారాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ధర్మవీర్ శర్మ కుతుబ్ మినార్ గురించి ఎవరికీ తెలియని మరో కొత్త విషయాన్ని కూడా ప్రస్తావించారు. కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉంది. ఇది ప్రత్యేకంగా సూర్యుడిని గమనించడానికి తయారు చేశారట. ప్రతి ఏడాది జూన్ 21న, సూర్యాస్తమయం సమయంలో కనీసం ఓ అరగంట పాటు నీడ ఈ ప్రాంతంపై పడదట. అలాగే మినార్‌కి తలుపులు కూడా ఉత్తరం వైపు ఉంటాయి..ఇది రాత్రిపూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకు
ఇలా ఏర్పాటు చేసుకున్నారట. పురావస్తుశాఖ మాజీ అధికారి ధర్మవీర్ ఉద్దేశంలో… కుతుబ్‌మినార్‌ అనేది స్వతంత్ర నిర్మాణమే గానీ.. మసీదుకు సంబంధించినది కాదు.

Also read : UP mathura mosque : మొన్నరాముడు..నిన్నశివుడు..ఇప్పుడు కృష్ణుడు..మసీదులు-మందిరాల చుట్టూ వివాదాలు
కుతుబ్‌ మినార్‌ చుట్టూ ఉన్న వివాదాలు చాలవన్నట్లు ఇప్పుడు కొత్త వాదనతో సరికొత్త దుమారం రేగుతోంది. అక్కడున్న హిందూ దేవాలయాన్ని కూల్చేసి కుతుబ్ మినార్ కట్టారన్న దానిపై ఇంత వరకు రచ్చ నడిచింది. ఇప్పుడు పురావస్తుశాఖ మాజీ అధికారి వాదనతో.. కాంట్రవర్సీ కొత్త టర్న్ తీసుకుంది. అసలది ఢిల్లీ సుల్తాన్‌ కట్టడమే కాదంటున్నారాయన. దీంతో హిందూ సంఘాల వాదనకు మరింత బలంగా చేకూరినట్లైంది. ఇప్పటికే పలు హిందూ సంఘాలు కుతుబ్ మినార్ ముందు ఆందోళనలు, నిరసనలు, భజనలు చేస్తూ నానా హడావుడి చేస్తున్నాయి.అక్కడ పూజలు చేసుకోవడానికి హిందువులకు అనుమతి ఇవ్వాలని ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇప్పుడు కుతుబ్ మినార్ ఒక సూర్య గోపురం అన్న విషయం తెరపైకి రావడంతో ఇక రచ్చ పీక్స్‌కు చేరుకోవడం ఖాయంలా కనిపిస్తోంది.
నిజానికి కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు ప్రాంగణంలో ఉన్న స్తంభాలపై, రాళ్లపై హిందూ దేవతల శిల్పాలు, హిందూ మతానికి చెందిన ఆకృతులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు 27 హిందూ, జైన దేవాలయాల శిథిలాలు పడి ఉన్న చోట ఈ మసీదును నిర్మించినట్లు కుతుబ్ మినార్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న శిలాశాసనంలో రాసి ఉంది. హీట్‌ చూస్తుంటే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ముందు ముందు మరింత రచ్చ రేగేలా ఉంది.