Skipping : వాకింగ్, జాగింగ్ కంటే స్కిప్పింగ్ వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందా!..

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు స్కిప్పింగ్ ఒక చ‌క్క‌ని వ్యాయామం అని చెప్ప‌వ‌చ్చు. స్కిప్పింగ్ చేస్తే నిమిషానికి సుమారుగా 15 నుంచి 20 క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. అంటే 15 నిమిషాల పాటు

Skipping : వాకింగ్, జాగింగ్ కంటే స్కిప్పింగ్ వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందా!..

Skipping

Skipping : ఆరోగ్యంగా ఉండేందుకు, శరీర ధృఢత్వం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తుంటారు. వాకింగ్,జాగింగ్, జిమ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలతో పాటు సరైన ఆహార పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏటంటే స్కిప్పింగ్ చేయటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, పౌష్టికాహారాన్ని తీసుకుంటూ నిత్యం యాక్టివ్ గా శరీరాన్ని ఉంచుకోవాలంటే రోజుకు 10 నిమిషాలపాటు స్కిప్పింగ్ చేయటం వల్ల ఆరోగ్య వంతంగా జీవించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

శ‌రీర ధృఢత్వానికి, యాక్టివ్ గా ఉండేందుకు ఉప‌యోగ‌ప‌డే వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒక‌టి. వాస్తవానికి ప్రతిరోజు గంటపాటు వాకింగ్ చేయటం కన్నా 10 నిమిషాలు స్కిప్పింగ్ చేయటం వల్ల ఎక్కవ క్యాలరీలు ఖర్చవ్వటంతోపాటు రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. .స్కిప్పింగ్ ఓ చ‌క్క‌ని కార్డియో వ్యాయామం అని చెప్ప‌వ‌చ్చు. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెకు వ్యాయామం అవుతుంది. శ‌రీరంలో అన్ని అవ‌య‌వాల‌కు ర‌క్తం, ఆక్సిజ‌న్ స‌రిగ్గా స‌ర‌ఫ‌రా అవుతాయి. స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల శ్వాస తీసుకోవ‌డంలో ఉండే ఇబ్బందులు తొల‌గిపోతాయి. శ‌క్తి సామ‌ర్థ్యాలు పెరుగుతాయి. గుండెకు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల కాళ్లు, పొట్ట‌, న‌డుం ద‌గ్గ‌ర భాగాల్లో వ్యాయామం అవుతుంది. ఆయా భాగాలు చ‌క్క‌ని ఆకృతిని పొందుతాయి. అక్క‌డ ఉండే కండ‌రాలు దృఢంగా మారుతాయి. శ‌క్తి ల‌భిస్తుంది. దృఢంగా మారుతారు.

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు స్కిప్పింగ్ ఒక చ‌క్క‌ని వ్యాయామం అని చెప్ప‌వ‌చ్చు. స్కిప్పింగ్ చేస్తే నిమిషానికి సుమారుగా 15 నుంచి 20 క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. అంటే 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా చాలు ఏకంగా 200 నుంచి 300 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. దీంతో శ‌రీరంలోని కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా చాలు శ‌రీరంలోచేయటం వల్ల క్యాలరీలు కరగటమే కాకుండా రక్తం సరఫరా కూడా మెరుగవుతుంది. చర్మం కాంతివంగంగా నిగారించుకుంటుంది.

ప్రతిరోజూ స్కిప్పింగ్ చేసే వారిలో ఎముకలు గుల్లబారిపోవటం, విరిగిపోవటం వంటి సమస్యలు ఉండవు. స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌ల స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు అంటున్నారు. మార్షల్ ఆర్టిస్టులు, అథ్లెట్లు, బాక్స‌ర్లు, టెన్నిస్ ప్లేయ‌ర్లు రోజు స్కిప్పింగ్ చేస్తూ శ‌రీరాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ శక్తి సామర్ధ్యాలను పెంచుకుంటుంటారు.

స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం మొత్తానికి వ్యాయ‌మం అవుతుంది. దీని వల్ల శరీరంలోని అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. అనారోగ్య స‌మ‌స్య‌లకు గురికాకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. ప్రతిరోజు వాకింగ్, జాగింగ్ చేసేందుకు సరైన సమయంలేని వారు రోజుకు 10 నిమిషాలు స్కిప్పింగ్ చేయటం వల్ల సంపూర్ణస్ధాయిలో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.