Congress Vs BJP: ఇందిర హయాంలోనే మైనారిటీలపై మొదట బుల్డోజర్ దాడులు జరిగాయి, మర్చిపోయారా: బీజేపీ నేత

బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆదివారం స్పందిస్తూ.."మనీష్ తివారీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మతిమరుపు వ్యాధి ఉందా? నాజీలు మరియు యూదులను మరచిపోండి, భారతదేశంలో మైనారిటీలపై బుల్డోజర్లను ఉపయోగించమని మొదట ఆదేశించినది ఇందిరా గాంధీ,

Congress Vs BJP: ఇందిర హయాంలోనే మైనారిటీలపై మొదట బుల్డోజర్ దాడులు జరిగాయి, మర్చిపోయారా: బీజేపీ నేత

Amit

Congress Vs BJP: జాతీయ రాజకీయాల్లో ‘బుల్డోజర్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో బీజేపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ..చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. “2వ ప్రపంచయుద్ధ కాలంలో యూదులకు వ్యతిరేకంగా నాజీల వలె భాజపా ప్రభుత్వం దేశ ప్రజలపై బుల్‌డోజర్‌లను ఉపయోగిస్తోంది” అంటూ ఇటీవల ఒక వ్యాసంలో మనీష్ తివారీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తివారీ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆదివారం స్పందిస్తూ..”మనీష్ తివారీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మతిమరుపు వ్యాధి ఉందా?..యూదులు, నాజీల సంగతి వదిలేయండి..అసలు భారత్ లో మైనార్టీలను అణచివేసేందుకు మొదట బుల్డోజర్లు ఉపయోగించింది ఇందిరా గాంధీ కాదా?” అని మాలవీయ ప్రశ్నించారు.

Also Read:Mahinda Rajapaksa : ఆర్థిక సంక్షోభంలో లంక.. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా తప్పదా?

ఇందిరా గాంధీ హయాంలో దేశ రాజధాని ఢిల్లీలోని తుర్కమెన్ గేట్ వద్ద మైనార్టీలపై బుల్డోజర్లతో దాడులు చేశారని.. మాలవీయ గుర్తుచేశారు. “కాంగ్రెస్ పార్టీలో మనీష్ తివారీ నుండి రాహుల్ గాంధీ వరకు ప్రతి ఒక్కరూ మతిమరుపుతో బాధపడుతున్నారా లేదా వారి స్వంత గతం గురించి వారికి తెలియదా? నాజీలు మరియు యూదులను మరచిపోండి, భారతదేశంలో మైనారిటీలపై బుల్డోజర్లను ఉపయోగించమని మొదట ఆదేశించినది ఇందిరా గాంధీ,” అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశాడు. తుర్క్‌మాన్ గేట్ వద్ద ఆనాడు జరిగిన ఈదాడుల్లో 20 మంది మృతి చెందారని మాలవీయ వివరించారు. అందుకు సంబందించిన ఒక పాత ఫోటోను సైతం మాలవీయ ట్వీట్ కి జత చేశారు.

Also read:Navneet Vs Thakrey: మరోసారి చిక్కుల్లో ఎంపీ నవనీత్ కౌర్.. మళ్లీ జైలుకు తప్పదా?

ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో రాహుల్ గాంధీ మేనమామ సంజయ్ గాంధీ చేసిన మితిమీరిన చర్యల గురించి కూడా ఈసందర్భంగా మాలవీయ ప్రస్తావించారు. “ఏప్రిల్ 1976లో, ఎమర్జెన్సీ సమయంలో, ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ, ముస్లిం స్త్రీ పురుషులను సంచరించాలంటూ బలవంతం చేశాడు. దీంతో మైనార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ తుర్క్‌మాన్ గేట్ వద్ద చేరుకోగా వారిని బుల్డోజర్లు చుట్టుముట్టాయి. ఈఘర్షణల్లో 20 మంది మరణించారు. నాజీలతో మొదలైన కాంగ్రెస్ రొమాంటిసిజం ఇందిరా గాంధీ వద్ద ఆపాలి” అని మాలవీయ ధీటుగా బదులిచ్చారు.

Also read:Pawan Kalyan Slams Government : వైసీపీ మళ్లీ వస్తే అంధకారమే-పవన్ కళ్యాణ్