TPCC Rachabanda : టీపీసీసీ చీఫ్‌‌ను మార్చాలన్న జగ్గారెడ్డి..సోనియా, రాహుల్‌‌లకు లేఖ

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ఏకైక ఎమ్మెల్యేగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు రచ్చబండ కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే...

TPCC Rachabanda : టీపీసీసీ చీఫ్‌‌ను మార్చాలన్న జగ్గారెడ్డి..సోనియా, రాహుల్‌‌లకు లేఖ

Updated On : December 27, 2021 / 7:29 PM IST

Jaggareddy Letter : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏకంగా అధిష్టానానికి ఆయన లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశమైంది. 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. అందులో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ ను మార్చాలని కోరారు. పార్టీ బైలాను ఆయన పాటించడం లేదని, సీనియర్ నేతలను కలుపుకోవడం లేదన్నారు. పీసీసీ కమిటీతో చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. అధిష్టానం నాయకత్వాన ఆయన్ను ఎంత కలుపుకొని పోవాలని అనుకుంటున్నా..కుదరడం లేదన్నారు. వ్యక్తిగత ఎక్స్ పోస్ కోసమే పని చేసుకుంటున్నారని, ఏ కార్యక్రమమైనా మీటింగ్ లో చర్చించకుండానే మీడియాని ఇంటికి పిలుపించుకొని ప్రకటన చేస్తున్నారని లేఖలో ఆరోపించారు.

Read More : Covid Cases In Delhi : 7 నెలల్లో అత్యధికంగా..ఢిల్లీలో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు

సమాచారం ఇవ్వడం లేదు : –
ఇది సీనియర్ నేతలకు ఇబ్బందిగా మారిందని…ఉమ్మడి మెదక్ జిల్లాలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సొంతంగా వరి విషయంలో…విజిట్ చేస్తానని ప్రకటన చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు వస్తున్నట్లు తనకు సమాచారం ఇవ్వకపోవడం తప్పే కదా…అని తెలిపారు. అంతేగాకుండా…సీఎం నియోజకవర్గంలోని ఎర్రవెల్లి గ్రామానికి వస్తున్నట్లు ప్రకటన చేశారని, ఇది కాంగ్రెస్ పార్టీ లైన్ లో కాకుండా తన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నానన్నారు. ఈ క్రమంలో…తన ఆవేదనను లేఖ ద్వారా తెలియచేస్తున్నట్లు, ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలా నడుస్తలేదని, ఇది ఒక కార్పొరేట్ పార్టీ ఆఫీస్ గా నడుస్తోందని వెల్లడించడం గమనార్హం. ఇందులో ఎదో కుట్ర జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారాయన. దీనిని వెంటనే గమనించి విచారణ చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు.

Read More : CM Jagan : ఇంటింటికీ వెళ్లి టీకాలు.. ఒమిక్రాన్ కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు

కాంగ్రెస్ లో ‘రచ్చ’ బండ :-
తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చబండ రచ్చ మొదలైంది. అసలే ఉప్పు నిప్పుగా ఉండే కొంతమంది నేతల మధ్య రచ్చబండ కార్యక్రమం చిచ్చు పెట్టింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను రైతులకు తెలియజేసేందుకు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కాకముందే.. కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి రచ్చ మొదలైంది. మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 2021, డిసెంబర్ ఎర్రవల్లిలో నిర్వహించనున్న రచ్చబండను బాయ్‌కాట్‌ చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ఏకైక ఎమ్మెల్యేగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు రచ్చబండ కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. రచ్చబండ కార్యక్రమాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నానని తెలిపారు జగ్గారెడ్డి. రేవంత్‌రెడ్డి అందరిని విడదీసి కార్యక్రమాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారాయన. ఈ విషయంపై అధిష్టానానికి లేఖ రాస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన లేఖ రాశారు.

Read More : Tirumala Darshan : జనవరి నెలలో సిఫార్సు లేఖలు అనుమతించబడవు.. ఏఏ రోజుల్లో అంటే……

జగ్గారెడ్డికి వీహెచ్ మద్దతు : –
మరోవైపు…తెలంగాణ పీసీసీ పిలుపు ఇచ్చిన రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ మద్దతు పలికారు. పార్టీ పరంగా జరిగే ఉద్యమానికి కాంగ్రెస్‌ నేతలకు సమాచారం ఇవ్వని టీపీసీసీ చీఫ్‌ చర్యను తప్పుపట్టారు. పీఏసీలో చర్చించకుండా రచ్చబండ కార్యక్రమాన్ని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీ నాయకత్వం విస్మరించడం ఏంటని ప్రశ్నించారు వీహెచ్‌. జనవరి 3 వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్‌ పార్టీ. అయితే నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో అప్పుడే విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా…జగ్గారెడ్డి రాసిన లేఖ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.