Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తెలిపోయింది.. ఇంతకీ కాంగ్రెస్ ఎవరిని నిర్ణయించిందో తెలుసా?

సీనియర్ నేత సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‭ మధ్య కొనసాగిన ముఖ్యమంత్రి కుర్చీ వార్‭కు ముగింపు చెప్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దాదాపుగా జరిగిపోయిందని పార్టీ వర్గాల నుంచి సమాచారం..

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తెలిపోయింది.. ఇంతకీ కాంగ్రెస్ ఎవరిని నిర్ణయించిందో తెలుసా?

Congress: కర్ణాటక ఉత్కంఠ తెర దింపేశారా? ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సీనియర్ నేత సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‭ మధ్య కొనసాగిన ముఖ్యమంత్రి కుర్చీ వార్‭కు ముగింపు చెప్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్యవైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దాదాపుగా జరిగిపోయిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే పార్టీ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Akhilesh Yadav: ప్రాంతీయ పార్టీలనే హీరోగా చూడాలి.. 2024లపై కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ వినూత్న ప్రతిపాదన

దక్షిణ కర్ణాటకలో రాజకీయంగా అత్యంత పట్టున్న వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత డీకే శివకుమార్. ఇక మధ్య కర్ణాటకతో పాటు ఉత్తర కర్ణాటకలో విస్తృతంగా ఉన్న వునుకబడిన సామాజికవర్గమైన కురుబ వర్గానికి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య. ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో దళిత జనాభా కూడా గణనీయంగా ఉంది. రాజకీయంగా ఓట్ల పరంగా బలంగా ఉన్న సామాజికవర్గం నుంచి బలమైన నేతలు ఉండడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలుపు సుగమమైందని అంటున్నారు.

Karnataka CM: ఎన్నికల్లో గెలవడం కంటే సీఎంను ఎంపిక చేయడమే కష్టమైంది.. కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్న గత అనుభవాలు

కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఆ పార్టీకి ఎన్నికల్లో గెలవడం కంటే ముఖ్యమంత్రిని నిర్ణయించడమే ప్రతీసారి పెద్ద సమస్యగా మారుతోంది. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కంటే ఇదే ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉంటుంది. దీని కారణంగా ఈ తొమ్మిది ఏళ్లలో కాంగ్రెస్ చాలా నష్టపోయింది కూడా. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఈ సమస్య తప్పడం లేదు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయమై పెద్ద గందరగోళం ఏర్పడింది. అయితే దీనికి తాజాగా తెరదించినట్లు తెలుస్తోంది.