Karnataka : రాష్ట్రాన్నే కుదిపేస్తున్న ఈవెంట్..కాలేజీలో 306 కరోనా కేసులు

చాలా మంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా క్యాంపస్‌ హాస్టళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్నారు.

Karnataka : రాష్ట్రాన్నే కుదిపేస్తున్న ఈవెంట్..కాలేజీలో 306 కరోనా కేసులు

College Corona

SDM College : కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. కేసులు ఇంకా నమోదవుతున్నాయి. ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలి..నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పాలకులు, అధికారులు హెచ్చరిస్తున్నా కొంతమంది బేఖాతర్ చేస్తున్నారు. మాస్క్ ధరించకుండా బయట తిరుగుతున్నారు. శానిటైజేషన్ తీసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా మరోసారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా…ఫంక్షన్లు, శుభకార్యాలు నిర్వహిస్తుండడంతో…ప్రజలు పెద్ద ఎత్తున్న గుమికూడుతున్నారు. అందులో ఏ ఒక్కరు కరోనా వైరస్ సోకినా..మిగతా వ్యక్తులు కూడా ఆ వైరస్ బారిన పడుతున్నారు.

Read More : Aircraft : అంటార్కిటికా గడ్డపై కొత్త చరిత్ర..తొలిసారిగా మంచుపై ల్యాండ్ అయిన విమానం

తాజాగా..కర్ణాటకలోని SDM కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌ మొత్తం రాష్ట్రాన్నే కుదిపేస్తోంది. మొదట 77 కరోనా కేసులతో రాష్ట్రాన్ని కలవరానికి గురి చేసిన ఈ కాలేజీలో తాజాగా మొత్తం కేసుల సంఖ్య 306కి పెరిగింది. కరోనా క్లస్టర్‌గా మారిన ఈ కాలేజీని ఉత్తర కర్ణాటక మెడికల్ హబ్‌గా పేర్కొంటారు. కానీ, ఈ కాలేజీలోనే కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. కాలేజీలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. కాలేజీ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసేసింది. అంతేకాదు, ప్రస్తుతం ఎస్‌డీఎం కాలేజీకి అరకిలోమీటరు దూరం పరిధిలోని ఇతర పాఠశాలలనూ మూసేశారు.

Read More : Rajesh Bhushan : ఒమిక్రాన్ వేరియంట్.. రాష్ట్రాల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ‌లు

ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు. ఎనిమిది అంబులెన్సులను సిద్ధం చేశారు. కాలేజీకి విజిటర్లను నిషేధించారు. మరోవైపు వైరస్ సోకిన వారిలో చాలా మంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా క్యాంపస్‌ హాస్టళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్నారు. వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. వీరి రక్త నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తిస్తున్నట్లు చెప్పారు.