Rajesh Bhushan : ఒమిక్రాన్ వేరియంట్.. రాష్ట్రాల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ‌లు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్‌లలో ఈ కేసులు బయటపడ్డాయి.

Rajesh Bhushan : ఒమిక్రాన్ వేరియంట్.. రాష్ట్రాల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ‌లు

Rajesh Bhushan

Rajesh Bhushan : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్‌లలో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో చాలా దేశాల ఈ దేశాల నుంచి ప్రజారవాణా నిలిపివేశాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ శనివారం ప్ర‌భుత్వ ఉన్నతాధికారుల‌తో స‌మావేశ‌మై క‌రోనా కొత్త వేరియంట్ గురించి చ‌ర్చించారు. ఈ నేప‌థ్యంలోనే న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌పై అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ లేఖ‌లు రాశారు.

చదవండి : PM Modi : ఒమిక్రాన్ వేరియంట్‌పై మోదీ స‌మీక్ష‌..అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల ఎత్తివేతపై పునరాలోచించాలని సూచన

కొత్త వేరియంట్ దేశంలో ప్ర‌వేశించే ప్ర‌మాదం పొంచి ఉన్నందున ప్ర‌భుత్వాలు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు రాసిన లేఖ‌ల్లో రాజేశ్ భూష‌ణ్ కోరారు. కొవిడ్ నిబంధ‌న‌లన క‌ఠినత‌రం చేయాల‌ని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ‌య‌ట‌ప‌డితే ఆ వైర‌స్ సోకిన వారిపై నిరంత‌ర నిఘా ఉంచాల‌ని సూచించారు.

దీంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించాయి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందిని అలెర్ట్ చేశాయి. వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయాలనీ అధికారులకు ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖామంత్రులు వైద్యసిబ్బందికి సూచనలు చేశారు.

చదవండి : Omicron : బిగ్ రిలీఫ్.. కరోనా కొత్త వేరియంట్‌పై కొవిడ్ టీకాలు పని చేస్తున్నాయ్..!