Ambedkar statue: చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతా: సీఎం కేసీఆర్

Ambedkar statue: ప్రజలు గెలిచే రాజకీయం ఈ దేశానికి అవసరమని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో దేశాన్ని లైన్‌లో పెడతానని తెలిపారు. మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Ambedkar statue: చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతా: సీఎం కేసీఆర్

KCR

Ambedkar statue: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. జై భీం నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించి, అదే నినాదంతో ముగించారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేస్తానని చెప్పారు. ఈ మాటలు కొంతమందికి మింగుడుపడకపోవచ్చని తెలిపారు.

బీఆర్ఎస్ కు మహారాష్ట్ర నుంచి మంచి స్పందన వస్తోందని కేసీఆర్ చెప్పారు. అదే విధంగా భవిష్యత్తులో దేశమంతటా బీఆర్ఎస్ కు స్పందన వస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు అందిస్తామని అన్నారు. తాము అంబేద్కర్ పేరుతో ప్రతి ఏడాది అవార్డులు ఇస్తామని తెలిపారు. రూ.51 కోట్ల నిధిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పారు.

అంబేద్కర్ విశ్వమానవుడని అన్నారు. 2024లో రాజ్యం మనదే మనదే మనదేనని తెలిపారు. ప్రజలు గెలిచే రాజకీయం ఈ దేశానికి అవసరమని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో దేశాన్ని లైన్‌లో పెడతానని తెలిపారు. మహారాష్ట్రలో తాను ఊహించని విధంగా ఆదరణ వచ్చిందని చెప్పారు. అదే ఆదరణ రేపు బెంగాల్, యూపీలో కూడా దక్కుతుందని తెలిపారు. అంబేద్కర్ కలలు, ఆశయాలు నెరవేరే విధంగా పనిచేద్దామని, విజయం మనదేనని చెప్పారు.

సీఎం, మంత్రులు, అధికారులు నిత్యం అంబేద్కర్ ను చూస్తూ ప్రేరణ పొందాలని వ్యాఖ్యానించారు. అందుకే తాము అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయం ప్రక్కన ఏర్పాటు చేశామని తెలిపారు. అంబేద్కర్ ది విగ్రహం కాదని విప్లవం అని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన చైతన్య దీపికగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తుందని తెలిపారు. తాము లక్షా 28 వేల కోట్ల రూపాయలను దళితుల సంక్షేమం కోసం ఖర్చుచేస్తున్నామని తెలిపారు.

Ambedkar statue: 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. ప్రకాశ్ అంబేద్కర్ ఏమన్నారంటే?