Arvind Kejriwal: ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతా: కేజ్రీవాల్ పై కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు

"ఏదో ఒక రోజు పంజాబ్ కు సీఎం అవుతానని, కాని పక్షంలో పంజాబ్ ను విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతానని" కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని కుమార్ విశ్వాస్ అన్నారు.

Arvind Kejriwal: ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతా: కేజ్రీవాల్ పై కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు

Aam

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆపార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏదో ఒక రోజు పంజాబ్ కు సీఎం అవుతానని, కాని పక్షంలో పంజాబ్ ను విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతానని” కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని కుమార్ విశ్వాస్ అన్నారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రతినిధికి బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరో నాలుగు రోజుల్లో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 117 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. ఈక్రమంలో కుమార్ విశ్వాస్(AAP Ex-leader) చేసిన ఈ వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Also read: Rahul Gandhi: ఆమ్ ఆద్మీ పార్టీ పై రాహుల్ గాంధీ చురకలు, స్పందించిన కేజ్రీవాల్

కుమార్ విశ్వాస్ మాట్లాడిన వీడియోను బీజేపీ నేత అమిత్ మాళవియా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక వేళ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అధికారంలోకి వస్తే ఇది ఎంతో ప్రమాదకరమని అమిత్ మాళవియా అన్నారు. దేశంపై కుట్రలు పన్నే ఇటువంటి నేతలను ఎన్నుకోవద్దంటూ ప్రజలకు సూచించారు. వీడియో ప్రస్తావనకు వస్తే.. “గతంలో పంజాబ్ ఎన్నికల పోటీ విషయమై ఒకరోజు నేను అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుకుంటున్నాము. పంజాబ్ రాష్ట్రాన్ని విడదీసే శక్తులైన ఖలిస్థాన్ వాదులతో సంబంధాలపై ఆయన్ను(కేజ్రీవాల్) హెచ్చరించాను. దానికి ఆయన స్పందిస్తూ(కేజ్రీవాల్) నాతో ఇలా అన్నాడు.. ఏదో ఒక నాడు పంజాబ్ కు సీఎం ను అవుతా..లేదంటే ఖలిస్థాన్ దేశానికి మొదటి ప్రధానిని అవుతా”. అంటూ అరవింద్ కేజ్రీవాల్ తో గతంలో తాను జరిపిన సంభాషణను కుమార్ విశ్వాస్ గుర్తు చేసుకున్నాడు.

Also read: Telangana : బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారు : కేటీఆర్

ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ ఢిల్లీలో ప్రజాధారణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే కొన్ని రోజుల్లోనే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో విసుగుచెందిన కుమార్.. పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం కవిగా కొనసాగుతున్న కుమార్ విశ్వాస్ ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్ మాట్లాడిన వీడియోలను ప్రసారం చేయవద్దంటూ మీడియా ఛానెళ్లను అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు.

Also read: PM Modi..Ravidas : రవిదాస్ జయంతి వేడుకల్లో సంగీత వాయిద్యంతో..ప్రధాని మోదీ సందడి..