Rahul Gandhi: ఆమ్ ఆద్మీ పార్టీ పై రాహుల్ గాంధీ చురకలు, స్పందించిన కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదులతో పోల్చుతూ రాహుల్ గాంధీ చురకలు అంటించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi: ఆమ్ ఆద్మీ పార్టీ పై రాహుల్ గాంధీ చురకలు, స్పందించిన కేజ్రీవాల్

Politcs

Rahul Gandhi: ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదులతో పోల్చుతూ రాహుల్ గాంధీ చురకలు అంటించారు. పంజాబ్‌లోని బర్నాలాలో జరిగిన బహిరంగ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘జాడూ’ (AAP ఎన్నికల గుర్తు) అధినేత ఉగ్రవాదుల ఇళ్లలోనూ కనిపిస్తారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఉగ్రవాది ఇంటిలో కాంగ్రెస్ నేతలు కనిపించరన్న రాహుల్..కానీ ‘జాడూ’కు చెందిన అతిపెద్ద నాయకుడు మాత్రం ఉగ్రవాది ఇంట్లో కూడా కనిపిస్తాడని కేజ్రీవాల్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంజాబ్‌ లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Also read: J&K : కశ్మీర్‌‌లో 10 మంది స్లీపర్ సెల్స్ అరెస్టు

ఇక రాహుల్ చేసిన “ఉగ్రవాది” వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బుధవారం మొహాలీలో పర్యటించిన కేజ్రీవాల్, రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 20 రోజుల్లో ఎవరేంటో రాహుల్ గాంధీ తెలుసుకుంటారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసి స్థానిక వ్యాపారులు భయపడిపోతున్నారని, వ్యాపారాలు మూసుకునే విధంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. మేము అధికారంలోకి వచ్చి “పచ్చ రాజ్”ను అణిచివేస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Also read: PM Modi..Ravidas : రవిదాస్ జయంతి వేడుకల్లో సంగీత వాయిద్యంతో..ప్రధాని మోదీ సందడి..