Kerala CM : అమెరికాకు కేరళ సీఎం.. అక్కడి నుంచే పాలన

జనవరి 19వ తేదీన మరోసారి కేబినెట్ భేటీ ఉంటుందని..దీనికి కూడా హాజరవుతానని..బెడ్ పై నుంచి మాట్లాడుతానన్నారు...

Kerala CM : అమెరికాకు కేరళ సీఎం.. అక్కడి నుంచే పాలన

Kerala CM

Kerala CM Vijayan Leaves For US : కేరళ సీఎం పినరయి విజయన్ అమెరికాకు వెళ్లారు. చికిత్స నిమిత్తం అక్కడకు వెళ్లారు. కొన్ని రోజులు అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని, ఇతరులకు పాలనాబాధ్యతలను అప్పచెప్పనని స్పష్టం చేశారు. ఆయన అమెరికాకు వెళుతుండడంతో పాలనను ఎవరికీ అప్పచెబుతారనే చర్చ జరిగింది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంవీ గోవందన్ లేదా కె.రాధాకృష్ణన్ కు బాధ్యతలు అప్పచెబుతారని అంతా భావించారు. కానీ..అలా జరగలేదు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు కొంత టెక్నాలజీ అవసరం అవుతుందని….దానిని ఉపయోగించుకుంటానన్నారు.

Read More : Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

గతంలో 2018లో వైద్య చికిత్స నిమిత్తం పినరయి విజయన్ అమెరికాకు వెళ్లిన సందర్భంలో…ఈపీ జయరాజన్ కు బాధ్యతలు అప్పచెప్పిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం తన భార్య, వ్యక్తిగత సిబ్బందితో కలిసి అమెరికాకు వెళ్లారు. జనవరి 29న రానున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశానికి సీఎం పినరయి వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. జనవరి 19వ తేదీన మరోసారి కేబినెట్ భేటీ ఉంటుందని..దీనికి కూడా హాజరవుతానని..బెడ్ పై నుంచి మాట్లాడుతానన్నారు.