Kishan Reddy: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?

తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఇంకా నాలుగు నెలలే ఉంటుందని, కనీసం ఈ సమయంలోనైనా హామీలను నెరవేర్చాలని అన్నారు.

Kishan Reddy: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?

Kishan Reddy

Updated On : July 21, 2023 / 5:48 PM IST

Kishan Reddy – BJP: రానున్న 100 రోజులు బీజేపీకి కీలకమని ఆ పార్టీ తెలంగాణ (Telangana) అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్(Hyderabad)లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఈ నెల 24న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే, ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కొత్త పెన్షన్‌దారుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. ఇప్పటికీ మాజీ సీఎం వైఎస్సార్ ఇచ్చిన రేషన్ కార్డులే తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధించుకున్నాక సీఎం కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు.

కేసీఆర్‌కు లేఖ
కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. 9 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎదుర్కొంటున్న నష్టాలు, సర్కారు ఇచ్చిన హామీలను లేఖలో కిషన్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఇంకా నాలుగు నెలలే ఉంటుందని, కనీసం ఈ సమయంలోనైనా హామీలను నెరవేర్చాలని అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తమ జీవితాలు మెరుగుపడతాయని ప్రజలు అనుకున్నారని, వారి ఆశలను మరింత పెంచుతూ 2014, 2018 ఎన్నికల ప్రచారాల్లో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలు నెరవేర్చడం లేదని చెప్పారు. రుణమాఫీ చేస్తామంటూ రైతులకు పెద్దఎత్తున ఆశలు కల్పించారని, ఓట్లు వేయించుకున్నక హామీలను నెరవేర్చలేని లేఖలో పేర్కొన్నారు. ప్రతిసారి ఎన్నికలయ్యాక హామీలను మరచిపోతున్నారని తెలిపారు.

Bandi Sanjay: సొంత పార్టీ నేతలపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. అందుకేనా?