Liger: ‘లైగర్‌’ టీం స్పెషల్ ట్రీట్.. మైక్ టైసన్‌కు భారతీయ వంటకాలు!

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్..

Liger: ‘లైగర్‌’ టీం స్పెషల్ ట్రీట్.. మైక్ టైసన్‌కు భారతీయ వంటకాలు!

Liger

Liger: విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మైక్ టైసన్ అడుగుపెట్టడంతోనే అంచనాలు ఆకాశన్నంటాయి. తాజాగా అమెరికాలో ప్రారంభించిన కొత్త షెడ్యూల్‌లో మైక్ టైసన్ జాయిన్ అయ్యారు. మైక్ టైసన్‌ సింప్లిసిటీ చూసి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లతో పాటు చిత్రయూనిట్ అంతా కూడా ఆశ్చర్యపోయింది.

Telugu New Films: డిసెంబర్ రావడమే ఆలస్యం టాలీవుడ్ జాతర షురూ!

మైక్ టైసన్, ఆయన భార్య కికి కోసం స్పెషల్‌గా భోజన ఏర్పాటు చేసింది లైగర్ టీం. ఇందులో మైక్ టైసన్ టెస్ట్ చేసిన మన భారతీయ వంటకాలను మెచ్చుకోవడమే కాకుండా ఆయనకు ఎంతో ఇష్టమైన వంటకాల గురించి అడిగి తెలుసుకున్నారని లైగర్ టీం ఆనందం వ్యక్తం చేసింది. గార్లిక్ నాన్, బట‌ర్ చికెన్, తందూరి చికెన్, ఫిష్ టిక్కా మసాలా, గోట్ బిర్యానీ లాంటి స్పెషల్ ఐటమ్స్‌తో లంచ్ ఏర్పాటు చేశారు. ఆలూ గోబీ, పాలక్ పన్నీర్, సమోస, కబాబ్స్‌లను మైక్ టైసన్ స్పెషల్‌గా అడిగార‌ట‌.

Telugu Films: టాలీవుడ్ బాట పట్టిన ఇంటర్నేషనల్ స్టార్స్!

ఇండియన్ వంటకాల మీద టైసన్‌కు ఉన్న మక్కువ చూసి చిత్రయూనిట్ ఆశ్చర్యపోయింది. చిత్రయూనిట్ ప్రేమగా వడ్డించడం, అతిథి మర్యాదలను చూసి మైక్ టైసన్ ముచ్చటపడ్డారు. సెట్స్ మీద మైక్ టైసన్ సంపూర్ణ సహాకారమందించగా.. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, అనన్య పాండే, ఛార్మీలు కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌లో అందరూ నవ్వులు చిందిస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి.

Pushpa: రిలీజ్‌కు ముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తుండగా.. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్న లైగర్ షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.