2000 note: కరెన్సీ నోటు టాయిలెట్ పేపర్ అవుతోంది.. 2000 నోట్ల రద్దుపై మహువా

2000 రూపాయల నోట్లై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం బీజేపీ, ప్రధాని మోదీ సృష్టించిన తప్పిదమని ఆమె వివర్శించారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రాన్ని కోల్పోయిన బీజేపీ, ఇలాంటి చర్యలు చేస్తే మరిన్ని రాష్ట్రాల్ని కోల్పోతారని, అలాగే అదానీని సైతం కాపాడలేరని మహువా అన్నారు

2000 note: కరెన్సీ నోటు టాయిలెట్ పేపర్ అవుతోంది.. 2000 నోట్ల రద్దుపై మహువా

Mahua Moitra: 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవడంతో నరేంద్రమోదీ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా అన్నారు. కరెన్సీ నోట్లు టాయిలెట్ పేపర్లలా మారిపోయాయని ఆమె విమర్శించారు. ఏ నాగరిక దేశమూ తమ కరెన్సీని ఇలా కానివ్వదని, కానీ మోదీ ప్రభుత్వం మాత్రం తమ ప్రజలను నిత్యం అలాంటి భయంలో ఉంచుతోందని మహువా మండిపడ్డారు.

Japan: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి భేటీ.. ఎందుకంటే?

2000 రూపాయల నోట్లై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం బీజేపీ, ప్రధాని మోదీ సృష్టించిన తప్పిదమని ఆమె వివర్శించారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రాన్ని కోల్పోయిన బీజేపీ, ఇలాంటి చర్యలు చేస్తే మరిన్ని రాష్ట్రాల్ని కోల్పోతారని, అలాగే అదానీని సైతం కాపాడలేరని మహువా అన్నారు. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. అయితే అటువంటి నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా బ్యాంకుల్లో మార్చుకోవడానికి ప్రజలకు సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఇది చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.

KNMA: దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ అండ్ కల్చర్ సెంటర్ భవన నమూనా విడుదల చేసిన సర్ డేవిడ్ అడ్జాయే

బ్యాంకు ఖాతాల్లో 2,000 కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయడానికి ఆర్బీఐ పరిమితిని పేర్కొననప్పటికీ, గరిష్టంగా 20,000 (2,000 రూపాయల 10 నోట్లు) రూపాయలు మాత్రమే మార్చుకోవడానికి అనుమతి ఉంటుంది. 2016 నాటి నోట్ల రద్దు చేసినట్లే ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది.