Japan: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి భేటీ.. ఎందుకంటే?

ఈ సమావేశంలో మోదీ, జెలెన్ స్కీతో పాటు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా పాల్గొన్నారు.

Japan: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి భేటీ.. ఎందుకంటే?

Japan

Japan: ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelenskyy)ని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) జపాన్ లో కలిశారు. జీ7 సదస్సు (G-7 Summit )లో అతిథి దేశాల హోదాలో పాల్గొనేందుకు జెలెన్ స్కీ, మోదీ.. హిరోషిమా(Hiroshima)కు వెళ్లారు. ఇందులో భాగంగా వారిరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, ఉక్రెయిన్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా నుంచి భారత్ దేశ అవసరాల రీత్యా చమురు కొనుగోలు చేస్తోంది. దీంతో గతంలో పలుసార్లు ఈ విషయంపై భారత్ తో ఉక్రెయిన్ మాట్లాడింది.

ఇవాళ కూడా ఈ అంశంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మోదీ, జెలెన్ స్కీతో పాటు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పీఎంతో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఫొటోలు పోస్ట్ చేసింది. యుద్ధ ప్రభావిత హిరోషిమాలో జరుగుతోన్న జీ7లో ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చించారు.

రష్యా, చైనా తీరు ప్రధానాంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మోదీతో సమావేశంలో పాల్గొనే ముందు జెలెన్ స్కీ జీ7 సదస్సు గురించి, రష్యా చేస్తోన్న యుద్ధం గురించి మాట్లాడారు. శాంతికి సమయం ఆసన్నమైందని చెప్పారు. జీ7 సదస్సు ద్వారా అది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Narendra Modi: మోదీని చూసి దగ్గరకు వచ్చి మరీ పలకరించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్