Acharya: ట్రైలర్‌తో మెగా ట్రీట్.. కొరటాల ఖాతాలో మరో బిగ్గెస్ట్ హిట్ పడ్డట్లేనా?

మెగాఫ్యాన్స్ కు మెగా ట్రీట్ దొరికేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య ట్రైలర్ వచ్చేసింది. ఆచార్యగా చిరూ, సిద్ధగా చరణ్ రప్ఫాడించినట్టు ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది.

Acharya: ట్రైలర్‌తో మెగా ట్రీట్.. కొరటాల ఖాతాలో మరో బిగ్గెస్ట్ హిట్ పడ్డట్లేనా?

Acharya

Acharya: మెగాఫ్యాన్స్ కు మెగా ట్రీట్ దొరికేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య ట్రైలర్ వచ్చేసింది. ఆచార్యగా చిరూ, సిద్ధగా చరణ్ రప్ఫాడించినట్టు ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకేముంది 152వ సినిమా ట్రైలర్ తోనే 152 థియేటర్స్ లో మోత మోగించిన మెగాస్టార్.. ఆచార్యతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నారు మెగాభిమానులు.

Acharya: ఆచార్యగా వచ్చేసిన మెగా హీరోలు.. అదిరిపోయిన ట్రైలర్!

ఆచార్యగా అదరగొట్టారు చిరంజీవి. సిద్ధగా చరణ్ హై ఎండ్ ఎనర్జీని చూపించారు. మొత్తానికి ఆచార్య ట్రైలర్ తో ఫ్యాన్స్ కు మెగా ట్రీట్ ఇచ్చారు మెగా హీరోలు. చిరూ 152వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ను ప్రపంచవ్యాప్తంగా 152 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 29న ఆచార్య విడుదలకు ఉండాల్సిన మెగా జోష్.. థియేటర్స్ దగ్గర ట్రైలర్ విడుదలకే కనిపించింది. అంతలా థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ చేసి… ఆచార్య కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో చెప్పేసారు.

Acharya: చిరు 152వ సినిమా.. 152 థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శన!

ఆచార్య క్రేజ్ ను మరింత పెంచేలా తన ట్విట్టర్ అకౌంట్ పేరును కూడా ఆచార్యగా మార్చేశారు మెగాస్టార్. ఇక ట్రైలర్ చూస్తుంటే.. ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసినట్టే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆచార్య బరిలోకి దూకబోతున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య కంటెంట్ తో పాటూ పవర్ఫుల్ డైనమిక్ యాక్షన్, మాస్ అంశాలున్న పుష్ప, అఖండ, ట్రిపుల్ ఆర్ సినిమాలు ఎలా సందడి చేశాయో.. ఆచార్య కూడా అంతే రేంజ్ లో దూకుడు చూపిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు.

Acharya: అన్న కోసం తమ్ముడు.. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్‌గా పవన్?

టీజర్ లో తండ్రీకొడుకులు కాసేపు కనిపిస్తే రెచ్చిపోయిన ఫ్యాన్స్.. ట్రైలర్ లో కాంబినేషన్ సీన్స్ కు విజిల్స్ వేస్తున్నారు. కేవలం చిరూ, చరణ్ కాంబినేషన్ సీన్స్ చూడటానికే సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వాళ్లూ లేకపోలేదు. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటికి తగ్గట్టే ఆచార్య ట్రైలర్ ను సిద్ధతో స్టార్ట్ చేసి ఫుల్ మార్కులు కొట్టేసారు డైరెక్టర్ కొరటాల శివ. ఇంత హై వోల్టెజ్ సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆచార్యను హిందీలోనూ రిలీజ్ చేయమని కొందరు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ లు కూడా పెట్టేస్తున్నారు.