Love Story : చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా చైతు సినిమా ఫంక్షన్..

నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు..

10TV Telugu News

Love Story: అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరీ’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. సంస్థలు నిర్మించాయి.. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడమే కాక సినిమా మీద అంచనాలు పెంచేసింది.

Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..

సెప్టెంబర్ 24 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది ‘లవ్ స్టోరీ’.. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. ఇక సెప్టెంబర్ 19న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. చిరు – నాగార్జున మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఇంతకుముందు అఖిల్ ‘హలో’ మూవీ ఈవెంట్‌కి కూడా వచ్చారు చిరు. మరోసారి స్నేహితుడి కొడుకు సినిమా ఫంక్షన్‌కి రాబోతున్నారాయన.

Love Story : నా నటన బాగుంది అంటే సగం క్రెడిట్ వాళ్లకే వెళ్లాలి..

‘లవ్ స్టోరీ’ సినిమా చూసిన సెన్సార్ టీం.. యూనిట్‌ని అభినందించారు. 2 గంటల 45 నిమిషాల నిడివిగల ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. చైతు -సాయి పల్లవి పెయిర్, కథలోని లవ్, ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని.. కచ్చితంగా సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల.

Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..