Rajasthan: పాకిస్తాన్లోని ప్రియుడి వద్దకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ చేరుకున్న మైనర్ బాలిక.. అక్కడే క్లైమాక్స్ ట్విస్ట్
వాస్తవానికి ఎయిర్పోర్ట్ కు వచ్చీ రాగానే టికెట్ అడగ్గానే జోక్ చేస్తుందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుకున్నారట. అయితే కాసేపటికి అది నిజమేనని తెలుసుకున్నారు. దీనికి ముందు పాకిస్తాన్ ప్రేమికుడు ఆమెను గట్టిగానే బ్రెయిన్ వాష్ చేశాడు

Minor Girl: సోషల్ మీడియా ప్రేమలు దేశ సరిహద్దుల్ని దాటేస్తున్నాయి. ఈ మధ్య ఈ ట్రెండ్ బాగానే కనిపిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్లో ఉన్న ప్రేమికుడిని కలిసేందుకు బయల్దేరింది రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక మనర్ బాలిక. అందుకోసం జైపూర్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది. వీసా, పాస్పోర్ట్ లేకుండా డైరెక్టుగా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లి, పాకిస్తాన్ టికెట్ కావాలంటూ కోరింది. దాంతో అనుమానం వచ్చిన ఎయిర్పోర్ట్ పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా పాకిస్తాన్ యువకుడితో ప్రేమ వ్యవహారం బయటపడింది. గురువారం జరగిందీ ఘటన.
వాస్తవానికి ఎయిర్పోర్ట్ కు వచ్చీ రాగానే టికెట్ అడగ్గానే జోక్ చేస్తుందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుకున్నారట. అయితే కాసేపటికి అది నిజమేనని తెలుసుకున్నారు. దీనికి ముందు పాకిస్తాన్ ప్రేమికుడు ఆమెను గట్టిగానే బ్రెయిన్ వాష్ చేశాడు. దీంతో తాను పాకిస్తానీ అని, రాజస్థాన్ లోని తన ఆంటీ ఇంటికి వచ్చానని చెప్పింది. రెండేళ్ల క్రితం వచ్చానని, ఇప్పుడు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పి అధికారులనే బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించింది. ఆమె మాటలు ఎయిర్పోర్ట్ సిబ్బందికి నమ్మశక్యంగా అనిపించలేదు. అయితే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం చెప్పింది.
అమ్మయిది రాజస్థాన్ రాష్ట్రంలోని సికర్ జిల్లా రతన్పుర గ్రామమని తెలుసుకున్నారు. ఆమెను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.